MS Dhoni: జీఎస్కేతో కలిసి 6 ఇన్ 1 ప్రచారంలో మహేంద్ర సింగ్ ధోనీ
పబ్లిక్ ఇంటరస్ట్ ప్రచారంలో భాగంగా జీఎస్కేతో కలిసి అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మహేంద్ర సింగ్ ధోనీ. కేవలం ఒక్కసారి వ్యాక్సినేషన్ వేసుకోవడం ద్వారా ఆరు జబ్బుల నుంచి....

Ms Dhoni
MS Dhoni: పబ్లిక్ ఇంటరస్ట్ ప్రచారంలో భాగంగా జీఎస్కేతో కలిసి అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మహేంద్ర సింగ్ ధోనీ. కేవలం ఒక్కసారి వ్యాక్సినేషన్ వేసుకోవడం ద్వారా ఆరు జబ్బుల నుంచి బయటపడొచ్చంటూ ప్రచారం చేస్తున్నారు. ధోనీ క్రికెట్ లో సిక్సు హిట్ చేయడాన్ని దీంతో లింక్ చేసి చెబుతున్నారు. ఈ క్యాంపైన్ ట్యాగ్ లైన్ ‘తక్కువ ఇంజెక్షన్లు, తక్కువ పెయిన్’ వల్ల వచ్చే బెనిఫిట్స్ బోలెడు అని ప్రచారం చేస్తున్నారు.
దీని వల్ల వచ్చే బెనిఫిట్స్
సరైన సమయానికి తక్కువ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల తక్కువ నొప్పితో పాటు కంఫర్ట్ కోల్పోకుండా ఉండొచ్చు.
తల్లిదండ్రులకు కూడా బెనిఫిట్ వస్తుంది. పీడియాట్రిషన్ ను సంప్రదించాల్సిన సమయం తగ్గుతుంది. వర్క్ లేదా ఫ్యామిలీ యాక్టివిటీని ఎక్కువ సార్లు వాయిదా వేయాల్సిన పనిలేదు.
6 ఇన్ 1 వ్యాక్సినేషన్ ఉపయోగం
Diphtheria, tetanus, pertussis (పొడి దగ్గు), poliomyelitis, Haemophilus influenza type B, hepatitis B లాంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. వేరు వేరు ఇంజెక్షన్ల వల్ల సమయంతో పాటు నొప్పి కూడా పలుమార్లు అనుభవించాల్సి వస్తుంది.