MS Dhoni
IPL 2024 : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉండే క్రేజే వేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ ద్వారా క్రికెట్ అభిమానులను అల్లరిస్తున్నాడు. ధోనీ కనిపించాడంటే పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీలకోసం పోటీపడుతుంటారు. పలు సందర్భాల్లో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ కోసం యువకులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Musheer Khan : సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సూపర్ బ్యాటింగ్.. సచిన్ రికార్డు బద్దలు
మార్చి 22 నుంచి ఐపీల్ 2024 టోర్నీ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఈసారికూడా ఆ జట్టుకు కెప్టెన్ గా ధోనీనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గత వారం రోజులుగా చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోపీని అందించేందుకు సన్నద్ధమవుతున్నాడు. తాజాగా చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తిచేసుకున్న తరువాత ధోనీ మైదానాన్ని వీడే క్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు, చిన్నారులు ధోనీ ఆటోగ్రాఫ్ కోసం పోటీ పడ్డారు. ధోనీసైతం ఏమాత్రం ఇబ్బందిపడకుండా ప్రతీఒక్కరికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లకు పనిచెప్పి ధోనీని ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు. ఈ వీడియోను చెన్నైసూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.
Also Read : Virat Kohli : కోహ్లి లేకుండానే టీ20 ప్రపంచకప్‌ను ఆడనున్న భారత్..? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Signing an everlasting bond with the fans! ?#WhistlePodu ?? pic.twitter.com/NCEFs6M587
— Chennai Super Kings (@ChennaiIPL) March 13, 2024