Musheer Khan : సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సూపర్ బ్యాటింగ్.. సచిన్ రికార్డు బద్దలు

సచిన్ రికార్డును బ్రేక్ చేయడంపై ముషీర్ ఖాన్ మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్ మ్యాచ్ చూసేందుకు వచ్చారని నాకు తెలియదు. నేను 60 పరుగులు దాటినప్పుడే స్క్రీన్ పై చూశాను.

Musheer Khan : సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సూపర్ బ్యాటింగ్.. సచిన్ రికార్డు బద్దలు

Musheer Khan

Ranji Trophy final : టీమిండియా ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు, గత ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ భారత్ జట్టులోని ప్లేయర్ ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్ లో అదరగొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. దీనికితోడు సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డునుసైతం బద్దలు కొట్టాడు. వాంఖడే స్టేడియంలో ముంబై – విదర్భ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముషీర్ ఖాన్ 326 బంతుల్లో 136 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు కొట్టాడు. తద్వారా రంజీట్రోఫీ ఫైనల్ లో సెంచరీ చేసిన అతిపిన్న వయస్సుడైన ముంబై బ్యాటర్ గా ముషీర్ ఖాన్ నిలిచాడు.

Also Read : రోహిత్ శర్మలో అద్భుతమైన నాయకుడిని చూశాను.. ఆరోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన అశ్విన్

వాంఖడే స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలు కూడా హాజరయ్యాడు. ఈ మ్యాచ్ లో ముషీర్ ఖాన్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 1994-95లో పంజాబ్ జట్టుపై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేశాడు. ఆ సమయంలో సచిన్ వయస్సు 22ఏళ్లు. ప్రస్తుతం 19ఏళ్ల 14రోజుల వయస్సులోనే రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ముషీర్ ఖాన్ సెంచరీ చేశాడు. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడుగా ముషీర్ ఖాన్ రికార్డుకెక్కాడు. ముషీర్ ఖాన్ సెంచరీ చేసిన సమయంలో అతని తండ్రి నౌషాద్ ఖాన్ కూడా స్టేడియంలోనే ఉన్నాడు. ముషీర్ ఖాన్ సెంచరీ చేయడంతో నౌషాద్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నౌషాద్ ఖాన్ ఆనందంలో గెంతులేశాడు.

Also Read : Virat Kohli : కోహ్లి లేకుండానే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆడ‌నున్న భార‌త్..? బీసీసీఐ మాస్ట‌ర్‌ ప్లాన్ ఇదేనా?

సచిన్ రికార్డును బ్రేక్ చేయడంపై ముషీర్ ఖాన్ మాట్లాడుతూ.. సచిన్ సర్ మ్యాచ్ చూసేందుకు వచ్చారని నాకు తెలియదు. నేను 60 పరుగులు దాటినప్పుడే స్క్రీన్ పై చూశాను. నా బ్యాటింగ్ తో సచిన్ సర్ ను ఆకట్టుకోవాలన్న ఆలోచన కలిగింది అంటూ ముషీర్ ఖాన్ తెలిపాడు.