Muhammad Waseem Comments after uae lost match to india in Asia Cup 2025
IND vs UAE : ఆసియాకప్ 2025ను యూఏఈ పేలవంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము భారత్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం వెల్లడించాడు.
ఈ మ్యాచ్(IND vs UAE )లో టాస్ ఓడిన యూఏఈ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమ్ఇండియా బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్లు అలిషన్ షరాఫు (22), మహ్మద్ వసీమ్ (19) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన ఆటగాళ్లు ఎవ్వరూ కూడా కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా చేసిన మూడు పరుగులే తరువాతి అత్యధిక స్కోరు అంటే యూఏఈ బ్యాటర్లు ఎంతలా విఫలం అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
Abhishek Sharma : అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. ఎలైట్ జాబితాలో చోటు..
ఆ తరువాత అభిషేక్ శర్మ (30; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (20 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్; 2 బంతుల్లో 1 సిక్స్) ధాటిగా ఆడడంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం స్పందించాడు. తాము బ్యాటింగ్‌ను మెరుగ్గానే ఆరంభామని చెప్పాడు. అయితే.. వరుసగా వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందని అన్నాడు. టీమ్ఇండియా వరల్డ్ నంబర్ వన్ జట్టు అని అన్నాడు. ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నాడు. తమ ప్రతి బ్యాటర్‌కు తగ్గట్టు వ్యూహాలతో వచ్చారని, వాటిని సమర్థవంతంగా అమలు చేశారన్నారు. అందుకే భారత్ నంబర్ వన్ జట్టు అని చెప్పాడు.
IND vs UAE : 2 గంటల్లోపే ముగిసిన మ్యాచ్.. పూర్తి మ్యాచ్ ఫీజు వస్తుందా? రాదా? సూర్య ఏమన్నాడంటే?
ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. ఓ జట్టుగా బలంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తామని ముహమ్మద్ వసీం తెలిపాడు.