Mumbai Indians : చ‌రిత్ర సృష్టించిన ముంబై ఇండియ‌న్స్‌.. అన్నీ విజ‌యాలే..

ఢిల్లీ పై విజ‌యంతో ముంబై ఓ అరుదైన ఘ‌న‌త సాధించింది.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును న‌మోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. తిల‌క్ వ‌ర్మ (59; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (40; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రికిల్‌టన్ (41; 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), న‌మ‌న్ ధీర్ (38 నాటౌట్; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో విప్రజ్ నిగమ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.

CSK : పృథ్వీ షాకు షాక్‌.. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో 17 ఏళ్ల కుర్రాడిని తీసుకున్న చెన్నైసూప‌ర్ కింగ్స్‌..!

ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ 19 ఓవ‌ర్ల‌లో 193 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో క‌రుణ్ నాయ‌ర్ (89; 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. అభిషేక్ పోరెల్ (33) రాణించాడు. మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ముంబై బౌల‌ర్ల‌లో కర్ణ్‌ శర్మ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్న‌ర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. జ‌స్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ సాధించాడు.

తొలి జ‌ట్టు ముంబై..

ఢిల్లీ పై విజ‌యంతో ముంబై ఓ అరుదైన ఘ‌న‌త సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌మ‌యంలో 200 కి పైగా స్కోర్లు చేసిన అన్ని సంద‌ర్భాల్లో ముంబై విజ‌యాన్ని సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 15 సంద‌ర్భాల్లో ముంబై ఈ ఘ‌న‌త సాధించింది. అటు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కూడా వ‌రుస‌గా 13 సార్లు ఇలా విజ‌యాన్ని సాధించింది.

RR vs RCB : అయ్యో.. కోహ్లీ భ‌య్యా నీకేమైంది? ఆ ఘ‌ట‌న‌తో ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌..

చెన్నై సూప‌ర్ కింగ్స్ విష‌యానికి వ‌స్తే.. 200 ఫ్ల‌స్ స్కోరు చెన్నై 21 సార్లు కాపాడుకోగా ఐదు సార్లు ఓడిపోయింది. ఆ త‌రువాత వ‌రుస‌గా ఆర్‌సీబీ (19 విజయాలు, 5 ఓటములు), సన్ రైజర్స్ (15 విజయాలు, 2 ఓటములు) ఉన్నాయి.