Mumbai Indians' ESA Day : 18k children cheer live MI vs DC IPL match at Wankhede stadium
Mumbai Indians’ ESA Day : ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 20వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై జెర్సీలో 18వేల మంది చిన్నారులు వాంఖడే స్టేడియంలో కూర్చుని నేరుగా మ్యాచ్‌ను వీక్షించారు.
వార్షిక ఈఎస్ఏ గేమ్ కోసం ఈ పిల్లలందరినీ ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్ నీతా అంబానీ తరపున తీసుకొచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగం అయిన రిలయన్స్ ట్రస్ట్ ద్వారా అందరికీ విద్య అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో ప్రతి సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టు ఆడే (ESA Day) మ్యాచ్‌ని నిర్వహిస్తోంది. 2010లో ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది పిల్లలకు జీవితాన్ని మార్చే అవకాశాలను అందిస్తోంది.
ముంబై జెర్సీలో మ్యాచ్ వీక్షించిన వేలాది మంది చిన్నారులు :
అంబానీ గ్రూప్ కంపెనీల తరపున వేలాది మంది పాఠశాల విద్యార్థులను ఈ మ్యాచ్‌కు తీసుకువస్తారు. అలాగే, ఐపీఎల్ టిక్కెట్లు విక్రయించే ముందు.. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ పిల్లలను ఏ మ్యాచ్‌కు తీసుకురావాలో నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముంబైలోని వివిధ ఎన్జీవోలకు చెందిన వేలాది మంది చిన్నారులను రిలయన్స్ ఫౌండేషన్ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా పిల్లలతో పాటు నీతా అంబానీ, ముంబై ఇండియన్స్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ఈఎస్ఏ డేను ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సమయంలో నీతా అంబానీ పిల్లతో కలిసి స్టాండ్స్‌లో సరదాగా గడిపారు.
అంతేకాదు.. తమ అనుభవాల గురించి పిల్లలతో సంభాషించారు. ‘పిల్లలు స్టేడియంకు ఎంతో ఆనందాన్ని తెస్తున్నారు. క్రీడ వివక్ష చూపదని, ప్రతిభ ఉన్నవారు ఎక్కడి నుంచైనా రావొచ్చునని నమ్ముతాను. బహుశా పిల్లలకు క్రీడలపై తమ అనుభవం మంచి జ్ఞాపకాలను మిగిల్చుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.
18,000 young supporters ?
18,000 innocent smiles ?
18,000 hearts cheering ?#ESADay is upon us! See you all at Wankhede for #MIvDC ?️#MumbaiMeriJaan #MumbaiIndians | @ril_foundation pic.twitter.com/XeNbqOegU6— Mumbai Indians (@mipaltan) April 7, 2024
సచిన్ ఏమన్నాడంటే? :
మొదటిసారిగా స్టేడియంను సందర్శించిన సచిన్ తన మొదటి జ్ఞాపకాల గురించి గుర్తుచేసుకున్నాడు. పిల్లలకు జీవితాన్ని మార్చే అనుభవాలను అందించాలనే నీతా అంబానీ దార్శనికతను సచిన్ అభివర్ణించారు. అంబానీ మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పిల్లలకు అవకాశాలను కల్పించిందని, విద్యతో పాటు క్రీడా రంగంలోనూ అంతే అవకాశాలను అందిస్తారని ఆశిస్తున్నానని సచిన్ తెలిపాడు.
ప్రతి బిడ్డకు ఆడుకునే హక్కు, చదువుకునే హక్కు ఉండాలి : నీతా అంబానీ
నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘మేము 14 ఏళ్ల క్రితం ఈఎస్ఏను ప్రారంభించాం. భారత్ అంతటా 22 మిలియన్ల పిల్లలకు చేరువైంది. సచిన్ చెప్పినట్లుగా.. ప్రతి బిడ్డకు ఆడుకునే హక్కు, చదువుకునే హక్కు ఉండాలని నేను నమ్ముతాను. పిల్లలు తరగతి గదుల్లో ఎంత నేర్చుకుంటారో ఆట స్థలంలో కూడా అంతే నేర్చుకుంటారు. క్రీడలు వారికి క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి అనేక విషయాలను బోధిస్తాయి.
అన్నింటికంటే ఎక్కువ విజయాలు, ఓటములను వారి పురోగతిలో ఎలా తీసుకోవాలో నేర్పుతాయి. ఈఎస్ఏ భారత్‌లోని మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి ఈ చిన్న పిల్లలకు మిలియన్ల కొద్దీ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది’అని అంబానీ పేర్కొన్నారు.
ఈ గేమ్ ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారని అన్నారు. క్రీడాకారులు నిజంగా మక్కువగల పిల్లల ముందు ఆడే అవకాశాన్ని ఎంతో ఆదరిస్తున్నారు. ఆటగాళ్లు, సిబ్బంది, కోచ్‌లకు ఇష్టమైన గేమ్. ఈ రోజు కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఆమె అన్నారు.
Read Also : MI vs DC : ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ పై ఘన విజయం