Rohit Sharma
Mumbai Indians Captain : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అయితే.. తాజాగా ముంబై జట్టు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు షాకిచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. టోర్నీలోకి అడుగుపెట్టిన మొదటి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు కప్పును అందించిన హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read : Kuldeep Yadav : కుల్దీప్‌యాదవ్ అరుదైన ఘనత.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
2013 సీజన్‌లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ముంబై జట్టు వరుస ఓటములను చవిచూసింది. ఆ సీజన్ మధ్యలో పాంటింగ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో హిట్‌మ్యాన్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్, జయసూర్య, షాన్ పొలాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఒక్కసారికూడా ముంబైకి కప్పును అందించలేకపోయారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు స్పందించలేదు.
Also Read : Suryakumar Yadav : గాయంతో మైదానాన్ని వీడిన సూర్య.. మ్యాచ్ తరువాత అసలు విషయం చెప్పేశాడు..
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తరువాత ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆసక్తికర ట్వీట్ చేసింది. ట్వీట్ ప్రకారం.. ‘2013లో మీరు ముంబై కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు. మీరు అప్పుడు మమ్మల్ని నమ్మండి అని మాకు చెప్పారు. విజయాల్లో, ఓటముల్లో అండగా నిలవాలని కోరారు. 10 సంవత్సరాలు ఆరు ట్రోఫీల తరువాత, మేము ఇక్కడ ఉన్నాము. ఎప్పటికీ మా కెప్టెన్ మీ వారసత్వం బ్లూ అండ్ బంగారం. ధన్యవాదాలు.. కెప్టెన్ రో.. అని ట్వీట్ లో పేర్కొన్నారు.
Ro,
In 2013 you took over as captain of MI. You asked us to ???????. In victories & defeats, you asked us to ?????. 10 years & 6 trophies later, here we are. Our ??????? ???????, your legacy will be etched in Blue & Gold. Thank you, ??????? ??? pic.twitter.com/KDIPCkIVop— Mumbai Indians (@mipaltan) December 15, 2023
A Rohit Sharma fan burns the Mumbai Indians' cap. pic.twitter.com/FtlTI20VvY
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2023