Suryakumar Yadav
Suryakumar Yadav – Mumbai Indians : దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా తాత్కాలిక టీ20 కెప్టెన్, పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు అయిన సూర్యకుమార్ యాదవ్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచులో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్న సూర్య అదే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చీలమండలానికి గాయం కావడంతో దాదాపు ఆరు నుంచి ఏడు వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించడంతో జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు టీ20 సిరీస్‌కు సైతం దూరం కానున్నాడు.
ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుని కోలుకుంటున్న సూర్యకుమార్ యాదన్‌ను ఐపీఎల్‌లో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఓ వీడియోతో సరదాగా టీజ్ చేసింది. చేతిలో కర్రను పట్టుకుని నడుస్తున్న సూర్య వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సినిమా వెల్‌కమ్ చిత్రంలోని ఓ పాపులర్ ఆడియో క్లిప్ ప్లే అవుతోంది. కాగా.. ఈ వీడియోకి గాయాలు తాత్కాలికమైనవి, ఫీల్‌మీ శాశ్వతం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఇదే వీడియోను సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. గాయాలు ఎప్పుడూ సరదాగా ఉండవు అని అన్నాడు. అయితే.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పాడు. త్వరలోనే పూర్తి ఫిట్‌గా మారుతానని ప్రమాణం చేశాడు. అప్పటి వరకు మీరందరూ హాలిడే సీజన్‌ను ఆస్వాదిస్తారని, ప్రతిరోజూ చిన్న చిన్న ఆనందాలను పొందుతున్నారని ఆశిస్తున్నాన్నట్లు రాసుకొచ్చాడు.
MS Dhoni : ధోని భవిష్యత్తు పై చెన్నై సీఈఓ కీలక అప్‌డేట్..