MS Dhoni : ధోని భ‌విష్య‌త్తు పై చెన్నై సీఈఓ కీల‌క అప్‌డేట్‌..

ధోని భ‌విష్య‌త్తు పై చెన్నై సూప‌ర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వ‌నాథ‌న్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

MS Dhoni : ధోని భ‌విష్య‌త్తు పై చెన్నై సీఈఓ కీల‌క అప్‌డేట్‌..

Chennai Super Kings CEO gives crucial update on MS Dhoni IPL future

MS Dhoni IPL future : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్ కోసం అన్ని జ‌ట్లు స‌న్నాహ‌కాలు మొద‌లుపెట్టాయి. డిసెంబ‌ర్ 19న దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ప‌లువురు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాయి. ఇక ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి చెన్నై సూప‌ర్ కింగ్స్ పైనే ఉంది. సీఎస్‌కే కెప్టెన్ అయిన‌ ధోనికి ఐపీఎల్ 2024 సీజ‌నే చివ‌రి సీజ‌న్ అని ఓ వైపు ప్ర‌చారం జ‌రుగుతోండ‌గా గాయం నుంచి ధోని కోలుకున్నాడా..? లేదా..? అనే ఖ‌చ్చిత‌మైన స‌మాచారం అయితే ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌రాలేదు.

దీంతో ధోని గాయం పై ఆందోళ‌న‌లు నెల‌కొన్న త‌రుణంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వ‌నాథ‌న్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ధోని ఐపీఎల్ కెరీర్ అత‌డి చేతుల్లోనే ఉంద‌న్నారు. మోకాలి గాయం నుంచి ధోని చాలా వ‌ర‌కు కోలుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ధోని పున‌రావాసం పొందున్నాడ‌న్నారు. జిమ్‌లో ఇప్ప‌టికే వ‌ర్కౌట్లు ప్రారంభించాడ‌ని, మ‌రో 10 నుంచి 15 రోజుల్లో నెట్స్‌లో అడుగుపెట్టేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు తెలిపాడు.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో మొద‌టి టెస్టుకు ముందు.. భార‌త్‌ను ఇబ్బంది పెడుతున్న రెండు అంశాలు ఇవే..?

ఎవ్వ‌రికి చెప్ప‌డు..

శనివారం చెన్నైలో జరిగిన జూనియర్ సూపర్ కింగ్స్ ఈవెంట్ లో కాశీ విశ్వ‌నాథ్ పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలో ఐపీఎల్‌లో ధోని భ‌విష్య‌త్తుపై, గాయం పై ప‌లు ప్ర‌శ్న‌లు ఎదురు అయ్యాయి. ధోని భ‌విష్య‌త్తుపై మాట్లాడుతూ.. ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు. కెప్టెన్ ధోనినే దీనిపై నేరుగా స‌మాధానం ఇస్తాడ‌ని తెలిపారు. అత‌ను ఏమి చేయాల‌నుకుంటున్నాడో ఎవ్వ‌రికి చెప్ప‌డ‌ని కాశీ విశ్వ‌నాథ్ తెలిపారు.

మార్చి 22 నుంచి ఐపీఎల్ ఆరంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయన్నారు. కాబ‌ట్టి మార్చి మొద‌టి వారంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ శిక్ష‌ణా శిబిరాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే.. ఎక్క‌డ అనే విష‌యాల‌ను ఇంకా నిర్ణ‌యించ‌లేదని, త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

Ishan Kishan : క్రికెట్‌కు ఇషాన్ కిష‌న్ దూరం..? మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టుకోడా..!

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో మోకాలి గాయంతో బాధ‌ప‌డుతూనే ధోని టోర్న‌మెంట్ మొత్తం ఆడాడు. ఈ క్ర‌మంలో ఫైన‌ల్ మ్యాచులో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఐదో సారి విజేత‌గా నిలిపాడు. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే ధోని ముంబైలో మోకాలికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు. తాను వ‌చ్చే సీజ‌న్‌ను ఆడుతాన‌ని ఇప్ప‌టికే ధోని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.