Virender Singh : సాక్షి మాలిక్‌కు మ‌ద్ద‌తు తెలిపిన రెజ్ల‌ర్ వీరేంద్ర సింగ్‌.. నేనూ ‘ప‌ద్మ‌శ్రీ’ని వెనక్కి ఇచ్చేస్తా..

సాక్షి మాలిక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ తాజాగా మ‌రో రెజ‌ర్లు వీరేంద్ర సింగ్ కూడా త‌న ప‌ద్మశ్రీ అవార్డును వెన‌క్కి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Virender Singh : సాక్షి మాలిక్‌కు మ‌ద్ద‌తు తెలిపిన రెజ్ల‌ర్ వీరేంద్ర సింగ్‌.. నేనూ ‘ప‌ద్మ‌శ్రీ’ని వెనక్కి ఇచ్చేస్తా..

Goonga Pahalwan Says Will Return Padma Shri In Solidarity With Wrestlers

Updated On : December 23, 2023 / 10:07 PM IST

Wrestler Virender Singh : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా క‌నిపించ‌డం లేదు. లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్‌భూష‌ణ్‌కు విధేయుడు అయిన సంజ‌య్ సింగ్ డ‌బ్ల్యూఎఫ్ఐ కొత్త అద్య‌క్షుడిగా ఎన్నిక‌కావ‌డాన్ని ప‌లువురు రెజ్ల‌ర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్ప‌టికే స్టార్ రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ ఆట‌కు రిటైర్‌రెంట్ ప్ర‌క‌టించ‌గా మ‌రో స్టార్ రెజ్ల‌ర్ బ‌జ్‌రంగ పునియా త‌న ప‌ద‌్మశ్రీ అవార్డును వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

సాక్షి మాలిక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ తాజాగా మ‌రో రెజ‌ర్లు వీరేంద్ర సింగ్ కూడా త‌న ప‌ద‌్మశ్రీ అవార్డును వెన‌క్కి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ దేశ బిడ్డ‌, సోద‌రి సాక్షి మాలిక్ కోసం ప‌ద్మ‌శ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. సాక్షి మాలిక్ ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. దేశంలోని మిగ‌తా అగ్ర‌శేణి క్రీడాకారులు కూడా దీనిపై (వివాదంపై) త‌మ నిర్ణ‌యాన్ని చెప్పాల‌ని కోరారు.

IND-W vs AUS-W : రసవత్తరంగా మారిన భార‌త్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా ఏకైక టెస్టు మ్యాచ్

నిర్ణ‌యాలు భావోద్వేగాల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌దు..

డబ్ల్యూఎఫ్ఐ వివాదం నేప‌థ్యంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై హ‌రియాణా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌటాలా స్పందించారు. క్రీడాకారులు ఉద్వేగ‌భ‌రిత నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని సూచించారు. నిర్ణ‌యాలు అనేవి భావోద్వేగాల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌ద‌న్నారు. న్యాయ బ‌ద్దంగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని, ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. ఇప్పుడు క్రీడాకారులు ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు.

MS Dhoni : ధోని భ‌విష్య‌త్తు పై చెన్నై సీఈఓ కీల‌క అప్‌డేట్‌..