IND-W vs AUS-W : రసవత్తరంగా మారిన భార‌త్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా ఏకైక టెస్టు మ్యాచ్

ముంబై వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది.

IND-W vs AUS-W : రసవత్తరంగా మారిన భార‌త్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా ఏకైక టెస్టు మ్యాచ్

IND-W vs AUS-W Test

Updated On : December 23, 2023 / 7:30 PM IST

India Women vs Australia Women Test : ముంబై వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో విఫ‌ల‌మైన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ధీటుగా బ‌దులిస్తోంది. దీంతో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా జ‌ట్టు త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయిన 233 ప‌రుగులు చేసింది. అన్నాబెల్ స‌థ‌ర్‌లాండ్ (12), గార్డెన‌ర్ (7) లు క్రీజులో ఉన్నారు.

ప్ర‌స్తుతానికి ఆసీస్ 46 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆసీస్ బ్యాట‌ర్లు ఎలా ఆడ‌తారు అనే దానిపైనే మ్యాచ్ ఫ‌లితం ఆధార‌ప‌డింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో త‌హ్లియా మెక్‌గ్రాత్ (73) హాఫ్ సెంచ‌రీతో రాణించింది. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు.

MS Dhoni : ధోని భ‌విష్య‌త్తు పై చెన్నై సీఈఓ కీల‌క అప్‌డేట్‌..

మ‌రో 30 ప‌రుగులు..

అంత‌క‌ముందు ఓవ‌ర్‌నైట్ స్కోరు 376/7 తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 30 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత పూజా వ‌స్త్రాక‌ర్ ఔట్ కాగా.. ఓవ‌ర్ నైట్ స్కోరుకు మ‌రో ఎనిమిది ప‌రుగులు జ‌త చేసిన దీప్తి శర్మ (78) కూడా తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియ‌న్‌కు చేరుకుంది. రేణుకా సింగ్ (8) కూడా ఔట్ కావ‌డంతో భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్ 406 ప‌రుగుల వ‌ద్ద ముగిసింది.

ఆస్ట్రేలియా త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 219 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో భార‌త్‌కు 187 ప‌రుగుల కీల‌క తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ధీటుగా ఆడుతోంది.

Ishan Kishan : క్రికెట్‌కు ఇషాన్ కిష‌న్ దూరం..? మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టుకోడా..!