Mushfiqur Rahim becomes first Bangladesh player to plays 100th Tests
Mushfiqur Rahim : బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తరుపున 100 టెస్టులు ఆడిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఢాకా వేదికగా నేడు (నవంబర్ 19, బుధవారం) ఐర్లాండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.
2005లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు ముష్ఫికర్ రహీమ్. ఇప్పటి వరకు అతడు 99 మ్యాచ్‌లు ఆడాడు. 182 ఇన్నింగ్స్‌ల్లో 38 సగటుతో 6351 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలు, 27 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 219 నాటౌట్.
Babar Azam : ఇది కదా బాబర్ ఆజామ్ అంటే.. రికార్డు ఎలాంటిదైనా తన పేరు ఉండాల్సిందే!
ఇక రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఢాకా మైదానంలో ముష్ఫికర్ రహీమ్ కు మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఆటగాడు అక్రమ్ ఖాన్, బిసిబి అధ్యక్షుడు మహ్మద్ అమీనుల్ ఇస్లాం లు ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.
బంగ్లాదేశ్ తరపున అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే..
ముష్ఫికర్ రహీం – 100*
మోమినుల్ హక్ – 75*
షకీబ్ అల్ హసన్ – 71
తమీమ్ ఇక్బాల్ – 70
A full-circle moment — Habibul Bashar, who handed Mushfiqur his very first Test cap, presents him with a special cap to mark his 100th Test. 🇧🇩✨ pic.twitter.com/ZT55MQTuL5
— Bangladesh Cricket (@BCBtigers) November 19, 2025