IPL 2020: యూఏఈలలో డోపింగ్ టెస్ట్‌లకు శాంపిల్స్ తీసుకున్న నాడా

  • Publish Date - October 13, 2020 / 04:42 PM IST

nada: యూఏఈలో డోపింగ్ టెస్ట్‌లకు ఆటగాళ్ల దగ్గరి నుంచి శాంపిల్స్ తీసుకున్నట్లుగా నాడా(National Anti-Doping Agency) ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చింది. IPL2020లో పాల్గొన్న క్రికెటర్లను డోప్ టెస్టింగ్ కోసం నాడా ఇండియా దుబాయ్‌లో నమూనాలను సేకరించే ఉద్యోగులను నియమించుకుంది.

నాడా తన అధికారిక హ్యాండిల్ నుంచి ఈ మేరకు ట్వీట్ చేసింది. ఐపీఎల్‌లో పాల్గొనే భారతీయ, అంతర్జాతీయ క్రికెటర్ల డోప్ టెస్టింగ్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లుగా నాడా వెల్లడించింది.


నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ మాట్లాడుతూ.. “డోప్ టెస్టింగ్ కోసం ఆటగాళ్ల నమూనాలను తీసుకునే ప్రక్రియ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. దీని గురించి మిగిలిన సమాచారం మాత్రం ఇప్పుడు వెల్లడించలేము” అని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 19 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభమైన ఐపిఎల్.. ఇప్పటికే సగం ప్రయాణం ముగించుకుంది.


ఇప్పటివరకు, అన్ని జట్లు ఏడు మ్యాచ్‌లు ఆడగా.. ఈ సమయంలో, ముంబై ఇండియన్స్ ఐదు విజయాలతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్.. రెండవ స్థానంలో ఉంది. ముంబై-ఢిల్లీ-బెంగళూరు ఐదు మ్యాచ్‌లు, కోల్‌కతా నాలుగు, హైదరాబాద్, రాజస్థాన్ మూడు మ్యాచ్‌లు గెలిచాయి.

ట్రెండింగ్ వార్తలు