Site icon 10TV Telugu

Khel Ratna : ఖేల్ రత్నాలు వీరే..12 మంది క్రీడాకారులు

Khel

Khel

National Sports Award : భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను ఈ ఏడాది 12 మంది క్రీడాకారులు అందుకోనున్నారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ 12 మంది క్రీడాకారుల పేరును ప్రకటించింది. వీరిలో నీరజ్‌ చోపా, రవికుమార్‌, లవ్లీనా, శ్రీజేష్‌, అవని, సుమిత్‌, ప్రమోద్‌, కృష్ణ నగార్‌, మనీష్‌, మిథాలీరాజ్‌, సునీల్‌ ఛెత్రి, మన్‌ప్రీత్‌ సింగ్‌ ఉన్నారు. ఈ నెల 13న ఢిల్లీలో ఈ పురస్కారాలను క్రీడాకారులకు అందించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పురస్కారానికి ఎంపికైన క్రీడాకారులు అందుకోనున్నారు.

Read More : COP26 : బిల్ గేట్స్‌‌తో మోదీ భేటీ

గతంలో లేనివిధంగా ఈసారి 12 మంది క్రీడాకారులు జాతీయ అత్యుత్తమ పురస్కారాలను అందుకోనున్నారు. గతేడాది ఐదుగురికి ఈ అవార్డును ప్రదానం చేశారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారం కోసం 11 మందిని సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించి కేంద్ర క్రీడల శాఖ ఆమోదానికి పంపించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఒలింపిక్స్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో కీలకంగా వ్యవహరించిన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ను కూడా ఖేల్‌రత్న వరించింది. దీంతో మొదట ప్రతిపాదించిన 11 మందితో పాటు మన్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఈ అవార్డు  అందుకోనున్నారు.

Exit mobile version