COP26 : బిల్ గేట్స్‌‌తో మోదీ భేటీ

కాప్‌-26 సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తోనూ సమావేశమయ్యారు ప్రధాని మోదీ.

COP26 : బిల్ గేట్స్‌‌తో మోదీ భేటీ

Modi And Bill Gates

PM Modi Meets Bill Gates : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. గ్లాస్గో సమావేశాల్లో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో ఆయన సమేవేశమయ్యారు. కాప్‌-26 సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తోనూ సమావేశమయ్యారు ప్రధాని మోదీ. వాతావరణ మార్పులను తగ్గించడంలో కృషి చేయడంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై వారి మధ్య చర్చ జరిగింది. ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం, వ్యవసాయం విభాగాల్లో మరింత వృద్ధి సాధించేందుకు భారత్‌ చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు గేట్స్‌ ఫౌండేషన్‌ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

Read More : T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు వరుసగా నాలుగో విజయం

ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’తో ఎన్నో లాభాలున్నాయన్నారు ప్రధాని మోదీ. గ్లాస్గోలో జరిగిన రెండోరోజు కాప్‌-26 సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన… సౌరశక్తి సామర్థ్యంపై మాట్లాడారు. సౌరశక్తి పరిశుభ్రమైనదిగా పేర్కొన్న మోదీ.. ఇస్రో సోలార్​కాలిక్యులేటర్​రూపొందిస్తోందని స్పష్టం చేశారు. సోలార్​ ప్రాజెక్టుల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. సౌరశక్తిని వినియోగించుకుంటే ప్రపంచానికి మంచి జరుగుతుందన్నారు.

Read More : Huzurabad By Poll : రూ. 25 కోట్లకి రేవంత్ రెడ్డి అమ్ముడుపొయాడు – కౌశిక్

ఐదు రోజులపాటు ఇటలీ, బ్రిటన్​లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారత్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన జీ20 సదస్సు, కాప్-26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు. పారిస్​ ఒప్పందంలోని తీర్మానాలకు భారత్​ కట్టుబడి ఉండటమే గాకుండా.. రానున్న 50 ఏళ్ల కోసం ప్రతిష్ఠాత్మక ఎజెండాను ఏర్పాటు చేసుకున్నట్లు  మోదీ ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ఇండియాకు బయలుదేరడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ… స్కాట్లాండ్‌లోని ప్రవాస భారతీయులను  కలుసుకున్నారు. వారికి ఆన ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడ భారతీయులతో కలిసి డోలు మోగించారు ప్రధాని. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని మోదీ అభినందించారు.