Sports Awards By President
National Sports Awards 2021: రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రస్తుత సంవత్సరంలో క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేయనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేసి సత్కరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నవంబర్ 2న విడుదల చేసింది.
జాతీయ క్రీడా అవార్డులు 2021 అందుకోనున్న అథ్లెట్ల జాబితా
ఖేల్ రత్న అవార్డు 2021
నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రవి కుమార్ (రెజ్లింగ్), లోవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్), శ్రీజేష్ పిఆర్ (హాకీ), అవనీ లేఖా (పారా షూటింగ్), సుమిత్ ఆంటిల్ (పారా-అథ్లెటిక్స్)లతో పాటు 12 మందికి ఇవ్వనున్నారు.
అర్జున అవార్డు
ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), కృష్ణ నగర్ (పారా బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (పారా షూటింగ్), మిథాలీ రాజ్ (క్రికెట్), సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అర్పిందర్ సింగ్, సిమ్రంజిత్ కౌర్, శిఖర్ ధావన్, భవానీ దేవి, మోనిక, వందనా కటారియా, సందీప్ నర్వాల్, హిమానీ ఉత్తమ్ పరబ్, అభిషేక్ వర్మ, అంకిత రైనా, దీపక్ పునియా, దిల్‌ప్రీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్ అర్జున అవార్డును అందుకోనున్న క్రీడాకారులు.
………………………………………………… : ఈ.సీ.జీ. కోసం వెళ్తే… బట్టలు విప్పి వీడియోలు తీశాడు
ఇటీవల ముగిసిన టోక్యో 2020 ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన పురుషుల హాకీ ఇండియా జట్టులో పిఆర్ శ్రీజేష్, మన్‌ప్రీత్ సింగ్ మినహా అందరికీ అర్జున అవార్డు లభించింది.
పాల్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లక్రా, సుమిత్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, గుర్జంత్ సింగ్, మన్దీప్ సింగ్, షంషేర్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్, సిమ్రంజీత్ సింగ్, యోగేష్ కథునియా, నిషాద్ కుమార్, ప్రవీణ్ కుమార్ , సుహాష్ యతిరాజ్, సింగ్‌రాజ్ అధానా, భావినా పటేల్, హర్విందర్ సింగ్, శరద్ కుమార్.
……………………………………………………: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై అదనంగా రూ.99 ఫీజు
లైఫ్ టైం ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు విజేతలు
లైఫ్-టైమ్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు TP ఔసేఫ్, సర్కార్ తల్వార్, సర్పాల్ సింగ్, ఆశన్ కుమార్, తపన్ కుమార్ పాణిగ్రాహిలకు లభించింది.
ద్రోణాచార్య రెగ్యులర్ కేటగిరీలో రాధాకృష్ణన్ నాయర్ పి, సంధ్యా గురుంగ్, ప్రీతమ్ సివాచ్, జై ప్రకాష్ నౌటియల్, సుబ్రమణియన్ రామన్‌లకు ప్రదానం చేశారు.
ద్రోణాచార్య అవార్డుతో పాటు, బాక్సర్ లేఖా కెసి, చెస్ గ్రాండ్‌మాస్టర్ అభిజీత్ కుంటే, హాకీ డేవిందర్ సింగ్ గార్చా, బాక్సర్ వికాస్ కుమార్, స్విమ్మర్ సజ్జన్ సింగ్‌లకు జీవితకాల సాధనకు ధ్యాన్ చంద్ అవార్డును కూడా మంత్రిత్వ శాఖ అందించింది. పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) 2021కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ట్రోఫీని అందుకోనుంది.