×
Ad

IND A vs SA A : ఇదికదా కొట్టుడంటే..! సిక్సర్ల మోత మోగించిన ధ్రువ్ జురెల్ .. నిరాశపర్చిన ఆ ఇద్దర్లు స్టార్ ప్లేయర్లు

IND A vs SA A : బెంగళూరు వేదికగా భారత -ఎ వర్సెస్ సౌతాఫ్రికా -ఎ ((IND A vs SA A) జట్లు రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడుతున్న..

IND A vs SA A

IND A vs SA A : భారత -ఎ వర్సెస్ సౌతాఫ్రికా -ఎ ((IND A vs SA A) జట్లు రెండు మ్యాచ్ ల అనధికారిక టెస్టు సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికా-ఎతో అనధికారిక రెండో టెస్టులో భారత్ -ఎ జట్టు తలపడింది. సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. కానీ, ఒకేఒక్కడు మాత్రం సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. దీంతో సెంచరీనిసైతం నమోదు చేశాడు.

రిషబ్ పంత్ సారథ్యంలో భారత్ -ఎ జట్టు సౌతాఫ్రికా-ఎ జట్టుతో తలపడుతుంది. మొదటి టెస్టులో సఫారీ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. అయితే, గురువారం నుంచి రెండో టెస్టు బెంగళూరు వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా -ఎ జట్టు తొలుత భారత -ఎ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

Also Read: IND vs AUS 4th T20 : నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ పై ఘ‌న విజ‌యం.. 2-1 ఆధిక్యంలోకి భార‌త్‌

ఈ మ్యాచ్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (19), అభిమన్యు ఈశ్వరన్ (0) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ సైతం కేవలం 17 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. దేవదత్ పడిక్కల్ ఐదు పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. 20బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 24 పరుగులు చేశాడు. ఇక హర్ష్ దూబే (14), ఆకాశ్ దీప్ డకౌట్ ఇలా వెంటవెంటనే వికెట్లు పడుతున్నా.. మరోపక్క ధ్రువ్ జురెల్ అద్భుత బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా-ఎ జట్టు బౌలర్లను ఉతికారేశాడు. ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు. దీంతో భారత్ -ఎ జట్టు గౌరవ పదమైన స్కోర్ చేసేలా చేశాడు.

తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ – జట్టు 255 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ జురెల్ 175 బంతుల్లో 132 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ (20), మహమ్మద్ సిరాజ్ (15) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా -ఎ జట్టు బౌలర్లలో టియాన్ వాన్ వురెన్ (Tiaan van Vuuren) నాలుగు వికెట్లు పడగొట్టాడు.