రికార్డు.. 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్.. వీడియో చూస్తారా?

ఇంతకుముందు ఈ ఘనత యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ పేర్ల మీదే ఉంది.

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి రికార్డుల్లోకెక్కాడు నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ. ఒమన్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ లో నేపాల్, ఖతార్ మధ్య ఇవాళ జరిగిన ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ20 ఆటలో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్ గా ఎయిరీ నిలిచాడు.

ఇంతకుముందు ఈ ఘనత యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ పేర్ల మీదే ఉంది. నేటి మ్యాచులో కేవలం 21 బంతుల్లో మొత్తం 7 సిక్సులు, 3 పోర్లు బాదిన దీపేంద్ర సింగ్ 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

కాగా, ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 211 పరుగల లక్ష్యఛేదనలో పోరాడిన ఖతార్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో నేపాల్ జట్టు 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విధ్వంసక బ్యాటింగ్ చేసిన నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Also Read : చెన్నైతో మ్యాచ్‌కు ముందు కెమెరాను బ‌ద్ద‌లు కొట్టిన సూర్య‌కుమార్ యాద‌వ్‌

ట్రెండింగ్ వార్తలు