Mitchell Marsh : ప్రపంచకప్ ట్రోఫీని అగౌరవపరిచిన మిచెల్ మార్ష్..! దుమ్మెత్తిపోస్తున్న నెటీజన్లు..వాళ్లను చూసి నేర్చుకో..
Mitchell Marsh Disrespecting World Cup Trophy : వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అగౌరవ పరిచినట్లు ఆరోపణలు వచ్చాయి.
- Thota Vamshi Kumar
- Updated on- November 20, 2023 / 10:37 AM IST
Mitchell Marsh Disrespecting World Cup Trophy
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఆ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే.. వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అగౌరవ పరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచకప్ ట్రోఫీ పై మిచెల్ మార్ష్ కాలు పెట్టినట్లు ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ కూడా ఉన్నారు. అతడు తన కెరీర్‌లో రెండవ సారి ప్రపంచకప్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో మార్ష్ 15 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 1 సిక్స్ కొట్టి 15 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసిన మార్ష్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన మార్ష్ ఆసీస్ కప్పును సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
PM Modi : ఫైనల్లో భారత్ ఓటమి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
కొంచెం అన్నా గౌరవం ఇవ్వు..
చరిత్రలో ఎవ్వరికి సాధ్యం కాని రీతిలో ఆస్ట్రేలియా ఆరో సారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఆనందానికి అవధులు లేవు. ఈ క్రమంలో పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా కుర్చీలో కూర్చుని ఉన్న మార్ష్ ప్రపంచకప్‌ను తన ముందు ఉంచుకుని దానిపై రెండు కాళ్లు పెట్టినట్లు ఉన్న ఓ ఫోటో వైరల్‌గా మారింది. ప్రపంచకప్ ట్రోఫీకి కాస్తనైన గౌరవం ఇవ్వాలని నెటీజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆరు సార్లు గెలిచినంత మాత్రన అంత గర్వం పనికి రాదని అంటున్నారు. దిగ్గజ ఆటగాళ్లు సైతం ప్రపంచకప్‌కు ఇస్తున్న గౌరవాన్ని చూసైనా నేర్చుకోవాలని అన్నారు.
