Ganguly’s Record: గంగూలీ పాతికేళ్ల రికార్డును బద్దలు కొట్టిన కివీస్ ఆటగాడు

సౌరవ్ గంగూలీ.. టీమిండియాలో చెక్కుచెదరని రికార్డులు అనేకం క్రియేట్ చేశాడు. లార్డ్స్‌లో 1996లో తన మొదటి ఇన్నింగ్స్‌లో 131పరుగులు చేసి క్రియేట్ చేసిన రికార్డును పాతికేళ్ల తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(136 బ్యాటింగ్‌) బద్దలు కొట్టాడు.

సౌరవ్ గంగూలీ.. టీమిండియాలో చెక్కుచెదరని రికార్డులు అనేకం క్రియేట్ చేశాడు. లార్డ్స్‌లో 1996లో తన మొదటి ఇన్నింగ్స్‌లో 131పరుగులు చేసి క్రియేట్ చేసిన రికార్డును పాతికేళ్ల తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(136 బ్యాటింగ్‌) బద్దలు కొట్టాడు. 25ఏళ్ల క్రితం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లో ఆరంగ్రేటం మ్యాచ్‌లో గంగూలీ 131పరుగులు చేసి ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు.

రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతోంది. మ్యాచ్ మొదటి రోజు, న్యూజిలాండ్ ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. తన మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అద్భుతమైన సెంచరీ చేశాడు. మ్యాచ్ మొదటి రోజు, టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

తొలి మ్యాచ్ ఆడుతున్న డెవాన్ కాన్వే‌ టామ్ లాథమ్‌తో కలిసి ఇన్నింగ్స్ తెరిచారు. మొదటి వికెట్‌కు 58 పరుగులు జోడించగా, లాథమ్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ విలియమ్సన్‌ను జేమ్స్ ఆండర్సన్ 13 పరుగులకు బౌల్ చేశాడు. రాస్ టేలర్ కూడా కేవలం 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డెవాన్ కాన్వే మరియు హెన్రీ నికోల్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకుని వికెట్లు పడకుండా స్కోరు రాబట్టారు.

లార్డ్స్‌లో టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మెన్లు:

జాన్ హాంప్‌షైర్ 107 ENG v West Indies 1969
సౌరవ్ గంగూలీ 131 IND v ENG 1996
ఆండ్రూ స్ట్రాస్ 112 ENG v NZ 2004
మాట్ ప్రియర్ 126 నో ENG v West Indies 2007
డెవాన్ కాన్వే TBC NZ v ENG 2021

ట్రెండింగ్ వార్తలు