IND vs NZ : మూడో టెస్టులోనూ టీమిండియా ఓటమి.. భారత టెస్టు చరిత్రలో తొలిసారి..

న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా మరోసారి ఘోర ఓటమిని చవిచూసింది. మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.

IND vs NZ 3rd Test

IND vs NZ 3rd Test : న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా మరోసారి ఘోర ఓటమిని చవిచూసింది. మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లలోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్ వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. మూడో టెస్టులో భాగంగా ఆదివారం రెండో ఇన్నింగ్స్ లో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. పంత్ క్రీజులో నిలదొక్కుకొని 64 పరుగులు చేశాడు. పంత్ ఔట్ అయిన తరువాత మళ్లీ వెంటవెంటనే వికెట్లు పడటంతో 121 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. దీంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు, మాట్ హెన్రీ ఒక వికెట్ తీశాడు. అజాజ్ తొలి ఇన్నింగ్స్ లోనూ ఐదు వికెట్లు తీశాడు.

 


తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 147.. ఆందోళనలో ఫ్యాన్స్