Nitish Kumar Reddy: SRH కు గుడ్ బై? మౌనం వీడిన నితీశ్ కుమార్ రెడ్డి.. ఎక్స్ లో కీలక పోస్ట్..

వాస్తవానికి ఇలాంటి ప్రచారాలకు తాను దూరంగా ఉంటానని చెప్పాడు. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వడం చాలా అవసరం అన్నాడు.

Nitish Kumar Reddy: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. నితీశ్ ఎస్ ఆర్ హెచ్ ను వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీశ్ ఎస్ఆర్ హెచ్ కు గుడ్ బై చెబుతాడనే రూమర్ బాగా వైరల్ అయ్యింది. తాజాగా ఈ ప్రచారంపై నితీశ్ కుమార్ రెడ్డి స్పందించాడు. తాను ఎస్ఆర్ హెచ్ ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై నితీశ్ క్లారిటీ ఇచ్చాడు.

వాస్తవానికి ఇలాంటి ప్రచారాలకు తాను దూరంగా ఉంటానని చెప్పాడు. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వడం చాలా అవసరం అన్నాడు. ఎస్ ఆర్ హెచ్ తో తన బంధం నమ్మకం, గౌరవం అనే వాటితో కొన్నేళ్లుగా కొనసాగుతోందని చెప్పాడు. నేను ఎప్పుడూ జట్టుతోనే ఉంటాను అని అతడు తేల్చి చెప్పాడు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టాడు నితీశ్. కాగా, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపడంపై నితీశ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడని, జట్టును వీడతాడని ప్రచారం జరిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి చివరకు ఆ ఫ్రాంచైజీతో విడిపోవాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై మౌనం వీడారు. గత వారం రోజులుగా యువ ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టును విడిచి 2026 ఎడిషన్‌కు ముందు కొత్త ఫ్రాంచైజీతో సైన్ అప్ చేయాలని చూస్తున్నట్లు తీవ్రమైన ఊహాగానాలు ఉన్నాయి. ఆదివారం దీనిపై నితీశ్ క్లారిటీ ఇచ్చాడు. “కొన్ని విషయాలకు స్పష్టత అవసరం. ఆ ప్రచారంలో నిజం లేదు. అవన్నీ పుకార్లే. నేను ఎల్లప్పుడూ ఫ్రాంచైజీకి అండగా ఉంటాను” అని నితీశ్ తేల్చి చెప్పాడు.

IPL 2025 ఎడిషన్‌లో నితీశ్ రెడ్డి అత్యుత్తమ ప్రదర్శన చూపలేదు. ఆడిన 13 మ్యాచుల్లో 22.75 సగటు, 18.95 స్ట్రైక్ రేట్‌తో కేవలం 182 పరుగులే చేయగలిగాడు. IPL 2025 సీజన్‌కు ముందు రెడ్డిని ఫ్రాంచైజ్ INR 6 కోట్లకు నిలుపుకుంది.