Nitish Kumar Reddy takes hat trick in SMAT 2025
Nitish Kumar Reddy : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ టోర్నీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నితీశ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు.
శుక్రవారం మధ్యప్రదేశ్, ఆంధ్ర జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 19.1 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బ్యాటర్లలో శ్రీకర్ భరత్ (39), నితీశ్ కుమార్ రెడ్డి (25) రాణించారు. మధ్య ప్రదేశ్ బౌలర్లలో శివమ్ శుక్లా నాలుగు వికెట్లు తీయగా త్రిపురేష్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు.
IND vs SA : మీరేమైనా అనుకోండి.. ఆ ఇద్దరు తోపు ప్లేయర్లు.. ఎలా వెనకేసుకొస్తున్నాడో చూడండి..
ఆ తరువాత 113 పరుగుల లక్ష్యంతో దిగిన మధ్య ప్రదేశ్‌కు నితీశ్ కుమార్ రెడ్డి చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను వేసిన అతడు హ్యాట్రిక్ సాధించాడు. ఈ ఓవర్‌లో చివరి మూడు బంతులకు వరుసగా హర్ష్ గవాలి, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్ లను పెవిలియన్‌కు చేర్చాడు. వీరిలో హర్ష్ గవాలి(5), రజత్ పాటిదార్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు.
నితీశ్ ధాటికి మధ్య ప్రదేశ్ 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. రిషబ్ చౌహాన్ (47), రాహుల్ బథమ్ (35 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (22) లు రాణించడంతో 17.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది మధ్య ప్రదేశ్. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు ఓవర్లు వేసిన నితీశ్ 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమైన నితీశ్ కుమార్ రెడ్డి మధ్యప్రదేశ్ తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. ఇదే ఫామ్ ను కొనసాగించి త్వరలోనే టీమ్ఇండియాలో అతడు చోటు దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.