కెప్టెన్ల జాబితాలో ధోని, రోహిత్, కోహ్లీ లేరు.. ఇక ఆనాటి జ్ఞాపకాలే నెమరేసుకోవాలా? మీమ్స్ వెల్లువ

ఐపీఎల్-2024లో ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.

Dhoni Rohit Kohli

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించడంతో దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు ధోనిని కెప్టెన్ స్థానంలో చూసిన అభిమానులు ఇప్పుడు ఇక అలా చూడలేం అని తెలుసుకుని తెగబాధపడిపోతున్నారు.

ఐపీఎల్-2024లో ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరిగిందని కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ కెప్టెన్ల ఫొటోల్లో ప్రతి ఏడాది ధోనిని చూస్తున్న తాము ఈ సారి అతడి ఫొటో కనపడకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నామని కొందరు కామెంట్లు చేశారు.

మొట్టమొదటిసారి కెప్టెన్ల ఫొటోలో ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో హర్ట్ అయ్యామంటూ కొందరు మీమ్స్ సృష్టించారు. కాగా, రేపు ప్రారంభం కానున్న ఐపీఎల్-2024 తొలి మ్యాచులో సీఎస్కే, ఆర్సీబీ తలబడనున్నాయి.

కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్ మీకోసం..

 

IPL 2024 : ఐపీఎల్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్‌ జట్టుకు భారీ షాక్..