T20 World Cup 2024: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 వేదిక మార్పు.. ఆ ఆలోచ‌న లేద‌న్న ఐసీసీ

గ‌త కొద్దిరోజులుగా 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్(T20 World Cup 2024) వేదిక మారుతుంద‌నే వార్త‌లు వినిపిస్తుండ‌గా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి( ICC) దీనిపై స్పందించింది.

T20 World Cup 2024

T20 World Cup: గ‌త కొద్దిరోజులుగా 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్(T20 World Cup 2024) వేదిక మారుతుంద‌నే వార్త‌లు వినిపిస్తుండ‌గా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి( ICC) దీనిపై స్పందించింది. వెస్టిండీస్‌(West Indies) యునైటెడ్ స్టేట్స్(US) ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ను మార్చే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని తెలిపింది. ఇంగ్లాండ్‌లో నిర్వ‌హిస్తారు అంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై అటు ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) స్పందించింది. ఆ వార్త‌ల‌ను కొట్టిపారేసింది.

WTC Final 2023: టీమ్ ఇండియా 296 ఆలౌట్‌.. ఆసీస్‌కు 173 ర‌న్స్ ఆధిక్యం

USA క్రికెట్‌లో అడ్మినిస్ట్రేటివ్ అనిశ్చితి కారణంగా టీ20 ప్రపంచ కప్ వేదికను యూఎస్, వెస్టిండీస్ నుంచి ఇంగ్లాండ్‌కు మారుస్తారంటూ వార్త‌లు వినిపించాయి. అయితే.. దీనిపై ICC మ‌రియు ECB వేరు వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో స్పందించాయి. తదుపరి T20 ప్రపంచ కప్‌ను వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం చేశాయి.

“ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్ మరియు యూఎస్‌ నుండి తరలించబడుతుందనే వార్తల్లో ఎటువంటి నిజం లేదు” అని ఈసీబీ అధికార ప్రతినిధి తెలిపారు. ‘వెస్టిండీస్ మ‌రియు యూఎస్‌ల‌లో మైదానాల త‌నిఖీలు ఇటీవ‌లే ముగిశాయి. జూన్ 2024లో ఈవెంట్ కోసం శ‌ర‌వేగంగా ప‌నులు కొన‌సాగుతున్న‌ట్లు ‘ICC ప్రతినిధి చెప్పారు.

ఇదిలా ఉంటే..2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అతి పెద్ద టోర్నీగా నిలవ‌నుంది. మొత్తం 20 జ‌ట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొన‌నున్నాయి.

T20 World Cup 2024: ప్ర‌పంచ‌క‌ప్ వేదిక‌ను మార్చే ఆలోచ‌న‌లో ఐసీసీ..! కార‌ణ‌మ‌దేనా..?