WTC Final 2023: టీమ్ ఇండియా 296 ఆలౌట్‌.. ఆసీస్‌కు 173 ర‌న్స్ ఆధిక్యం

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప‌ట్టు సాధించింది. కీల‌క మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. టీమ్ ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

WTC Final 2023: టీమ్ ఇండియా 296 ఆలౌట్‌.. ఆసీస్‌కు 173 ర‌న్స్ ఆధిక్యం

India all out at 296

WTC Final: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప‌ట్టు సాధించింది. కీల‌క మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. టీమ్ ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 173 ప‌రుగుల కీల‌క ఆధిక్యం ల‌భించింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 151/5తో మూడో రోజు ఆట కొన‌సాగించిన భార‌త్ మ‌రో 145 ప‌రుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ర‌హానే (89), శార్దూల్ ఠాకూర్‌(51) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌గా జ‌డేజా(48) ప‌ర్వాలేద‌నిపించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్ మూడు, బొలాండ్‌, గ్రీన్‌, స్టార్క్ లు త‌లా రెండు వికెట్లు, లియోన్‌లు ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

145 ప‌రుగులు 5 వికెట్లు

ఓవ‌ర్ నైట్ స్కోరు 151/5 మూడో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. రెండో బంతికే కేఎస్ భ‌ర‌త్‌(5)ను బొలాండ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ద‌శ‌లో భార‌త్ ఇన్నింగ్స్ తొంద‌ర‌గానే ముగుస్తుంద‌నిపించింది. అయితే.. ర‌హానే, శార్దూల్‌లు గొప్ప‌గా పోరాడారు. ఇద్ద‌రు చూడ‌చ‌క్క‌ని షాట్ల‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ క్ర‌మంలో క‌మిన్స్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ర‌హానే అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. ర‌హానేకు ఇది టెస్టుల్లో 26 హాప్ సెంచ‌రీ.

Ball Tampering: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో బాల్‌ టాంప‌రింగ్‌కు పాల్ప‌డిన ఆస్ట్రేలియా..? పుజారా, కోహ్లీల‌ను అలాగే ఔట్ చేశార‌ట‌..?

ప‌లుమార్లు ఔటైయ్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది ఈ జోడి. మంచి బంతుల‌ను గౌర‌విస్తూ చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. మ‌రో వికెట్ న‌ష్ట‌పోకుండా లంచ్ విరామానికి వెళ్లింది భార‌త్‌. లంచ్ బ్రేక్‌కు టీమ్ఇండియా స్కోరు 260/6.

10 ఓవ‌ర్ల‌లోపే

లంచ్ త‌రువాత భార‌త్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. శ‌త‌కం దిశ‌గా సాగుతున్న ర‌హానేను క‌మిన్స్ బోల్తా కొట్టించాడు. గ్రీన్ ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకోవ‌డంతో ర‌హానే పెవిలియ‌న్‌కు చేరుకోక‌త‌ప్ప‌లేదు. ర‌హానే-శార్దూల్ జోడి ఏడో వికెట్‌కు 109 ప‌రుగులు జోడించాడు. కాసేప‌టికే ఉమేశ్ యాద‌వ్‌(5) క్లీన్ బౌల్డ్ కాగా.. వేగం పెంచిన శార్దూల్ టెస్టుల్లో మ‌రో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఆ వెంట‌నే గ్రీన్ బౌలింగ్‌లో ఔటైయ్యాడు. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే ష‌మీ ఔట్ కావ‌డంతో భార‌త ఇన్నింగ్స్ ముగిసింది.

World Cup:క్రికెట్ అభిమానుల‌కు పండ‌గే.. ఆసియా క‌ప్‌, ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫ్రీగా చూడొచ్చు