Ball Tampering: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో బాల్‌ టాంప‌రింగ్‌కు పాల్ప‌డిన ఆస్ట్రేలియా..? పుజారా, కోహ్లీల‌ను అలాగే ఔట్ చేశార‌ట‌..?

లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డింద‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్న‌ట్లు పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు బాసిత్ అలీ ఆరోపించాడు.

Ball Tampering: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో బాల్‌ టాంప‌రింగ్‌కు పాల్ప‌డిన ఆస్ట్రేలియా..?  పుజారా, కోహ్లీల‌ను అలాగే ఔట్ చేశార‌ట‌..?

Kohli-Pujara

WTC Final-Ball Tampering: లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా భార‌త్(Team India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC Final) ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డింద‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్న‌ట్లు పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు బాసిత్ అలీ(Basit Ali) ఆరోపించాడు. అంపైర్ల‌కు, కామెంటేట‌ర్ల‌కు ఈ విష‌యం క‌నిపించ‌లేదా అంటూ మండిప‌డ్డాడు. కీల‌క ఆట‌గాళ్లు అయిన విరాట్ కోహ్లి(Virat Kohli,), పుజారా(Cheteshwar Pujara )ల‌ను బాల్‌ టాంప‌రింగ్(Ball Tampering) చేయ‌డం ద్వారానే ఔట్ చేశార‌ని చెబుతున్నాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమ్ఇండియా 151/5తో నిలిచింది. మ్యాచ్ ముగిసిన త‌రువాత త‌న యూట్య‌బూబ్ ఛాన‌ల్‌లో బాసిత్ అలీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ‘మొద‌ట‌గా కామెంట‌రీ బాక్స్ నుంచి మ్యాచ్ చూస్తున్న వారికి, అంపైర్ల‌కు నేను చ‌ప్ప‌ట్లు కొడ‌తాను. ఆసీస్ ఆట‌గాళ్లు స్ప‌ష్టంగా బాల్‌ను ఏదో చేశారు. దీనిపై ఎవ్వ‌రూ మాట్లాడ‌డం లేదు ఎందుకు..? ఏం జ‌రుగుతోంది. ఇక బ్యాట్స్‌మెన్లు కూడా ఏ అర్ధం కావ‌డం లేదా..? బ్యాట‌ర్లు బాల్ ను వ‌దిలివ‌స్తే బౌల్డ్ కావ‌డ‌మే ఇందుకు ఉదాహార‌ణ.’ అంటూ బాసిత్ అలీ ఆరోపణ‌లు చేశాడు.

WTC Final 2023: శ‌త‌కం చేజార్చుకున్న ర‌హానే.. ఏడో వికెట్ కోల్పోయిన భార‌త్‌.. Updates In Telugu

ఇందుకు త‌న వ‌ద్ద ఓ ఆధారం కూడా ఉన్న‌ట్లు చెప్పాడు. 54వ ఓవ‌ర్‌ను ష‌మీ వేస్తున్న‌ప్పుడు బంతి బ‌య‌ట వైపు మెరుపు ఉంది. అయితే బంతి స్మిత్‌కు లోప‌లి వైపు స్వింగ్ అయ్యింది. వాస్త‌వానికి ఇది రివ‌ర్స్ సింగ్వ్ కాదు. బంతి లోప‌లి వైపుకు మెరుపు ఉండి ఆ బంతి లోనికి దూసుకువ‌స్తే దానిని రివ‌ర్స్ స్వింగ్ అంటార‌ని అలీ చెప్పాడు.

భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, న‌యా వాల్ పుజ‌రాలు ఔటైన విధానం త‌న వాద‌న‌కు మ‌ద్ద‌తు చేకూరుస్తుంద‌ని చెప్పాడు. ‘భార‌త ఇన్నింగ్స్ లో 16 నుంచి 18వ ఓవర్ వరకూ కచ్చితంగా బాల్ టాంపరింగ్ జ‌రిగింది. విరాట్ ఔటైన‌ప్పుడు బంతి మెరుపు ఏ వైపుకు ఉందో గ‌మ‌నించారా.. మిచెల్ స్టార్క్ చేతిలో మెరిసే ఎండ్ బ‌య‌ట‌కు ఉంది అయితే.. బంతి ప‌క్క‌కు క‌దులుతోంది. గ్రీన్ బౌలింగ్‌లో పుజారా బాల్‌ను వ‌దిలి వేయ‌గా అది ఆఫ్ స్టంప్‌కు త‌గిలింది. దీంతో అత‌డు షాక్ తిన్నాడు. ఈ బంతికి నేను ఆశ్చ‌ర్య‌పోయాను. జ‌డేజా బంతిని ఆన్‌సైడ్‌లో కొడుతుంటే పాయింట్ మీదుగా బంతి వెలుతోంది. అంపైర్లు గుడ్డోళ్లు అయ్యారా..? వాళ్ల‌కు ఇలాంటి చిన్న చిన్న విష‌యాలు కూడా క‌నిపించ‌లేదా..?’ అంటూ అలీ మండిప‌డ్డాడు.

Steve Smith: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో స్టీవ్ స్మిత్ సెంచ‌రీ.. ప‌లు రికార్డులు బ్రేక్‌

బీసీసీఐ కూడా ఈ విష‌యాల‌ను ప‌ట్టించుకున్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరుకుంది అది చాలు అన్న‌ట్లుగా ఉంది వాళ్ల‌ది. 15-20 ఓవ‌ర్ల మ‌ధ్య కూక‌బుర్రా బంతి అయితే రివ‌ర్వ్ స్వింగ్ అవుతుంది కానీ డూక్స్ బాల్‌ అవుతుందా..? డ్యూక్స్ బాల్స్ రివ‌ర్స్ స్వింగ్ కావాలంటే క‌నీసం 40 ఓవ‌ర్లు అన్నా కావాల‌ని బాసిత్ అలీ అంటున్నాడు.