WTC Final 2023: ముగిసిన మూడో రోజు ఆట.. ఆసీస్ ఆధిక్యం 296 ప‌రుగులు

లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 ప‌రుగుల‌కు ఆలౌటైంది

WTC Final 2023: ముగిసిన మూడో రోజు ఆట.. ఆసీస్ ఆధిక్యం 296 ప‌రుగులు

wtc day 3

WTC Final:లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 09 Jun 2023 10:39 PM (IST)

    ముగిసిన మూడో రోజు ఆట

    మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో ల‌బుషేన్‌(41), కామెరూన్ గ్రీన్‌(7)లు ఉన్నారు.

  • 09 Jun 2023 10:02 PM (IST)

    ట్రావిస్ హెడ్ ఔట్‌

    మొద‌టి ఇన్నింగ్స్‌లో భారీ శ‌త‌కం బాదిన ట్ర‌విస్ హెడ్(18) ఈ సారి తొంద‌ర‌గానే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 111 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 09 Jun 2023 09:34 PM (IST)

    స్టీవ్ స్మిత్ ఔట్‌

    నిల‌క‌డ‌గా ఆడుతున్న స్టీవ్ స్మిత్‌(34)కు ఔట్ అయ్యాడు. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు స్మిత్‌. దీంతో 86 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది.

  • 09 Jun 2023 08:28 PM (IST)

    ఖ‌వాజా ఔట్‌

    ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. ఈ సారి ఉమేశ్ యాద‌వ్ షాక్ ఇచ్చాడు. ఉస్మాన్ ఖ‌వాజా(13) వికెట్ కీప‌ర్ భ‌ర‌త్ చేతికి చిక్కాడు. దీంతో 24 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది.

  • 09 Jun 2023 07:15 PM (IST)

    వార్న‌ర్ ఔట్‌

    173 ప‌రుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కీప‌ర్ శ్రీక‌ర్ భ‌ర‌త్ చేతికి డేవిడ్ వార్న‌ర్‌(1) చిక్కాడు. దీంతో రెండు ప‌రుగుల‌కే ఆసీస్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

  • 09 Jun 2023 06:35 PM (IST)

    టీమ్ఇండియా 296 ఆలౌట్‌

    ఆస్ట్రేలియాతో ఓవ‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 296 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓవ‌ర్ నైట్ స్కోరు 151/5తో మూడో రోజు ఆట కొన‌సాగించిన భార‌త్ మ‌రో 145 ప‌రుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ర‌హానే (89), శార్దూల్ ఠాకూర్‌(51) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌గా జ‌డేజా(48) ఫ‌ర్వాలేనిపించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్ మూడు, బొలాండ్‌, గ్రీన్‌, స్టార్క్ లు త‌లా రెండు వికెట్లు, లియోన్‌లు ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 09 Jun 2023 06:28 PM (IST)

    శార్దూల్ ఠాకూర్ అర్ధ‌శ‌త‌కం.. ఆ వెంట‌నే ఔట్‌

    క‌మిన్స్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ ఫోర్ కొట్టి అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 108 బంతుల్లో 6 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే ఔట్ అయ్యాడు. గ్రీన్ బౌలింగ్‌లో కీప‌ర్ కేరీ చేతికి చిక్కాడు. దీంతో 294 ప‌రుగుల వ‌ద్ద టీమ్ఇండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

  • 09 Jun 2023 05:57 PM (IST)

    ర‌హానే ఔట్

    క‌మిన్స్ బౌలింగ్‌లో గ్రీన్ క్యాచ్ అందుకోవ‌డంతో ర‌హానే(89) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 261 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది

  • 09 Jun 2023 05:12 PM (IST)

    లంచ్ బ్రేక్‌

    ఓవ‌ర్ నైట్ స్కోరు 151/5 తో టీమ్ఇండియా మూడో రోజు ఆట‌ను ప్రారంభించింది. రెండో బంతికే భ‌ర‌త్ ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత ర‌హానేతో శార్దూల్ ఠాకూర్ జ‌త క‌లిశాడు. ఇద్ద‌రు క‌లిసి నిదానంగా ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. ప‌లుమార్లు ఔటైయ్యే ప్ర‌మాదాల నుంచి త‌ప్పించుకున్నారు. మ‌రో వికెట్ ఇవ్వ‌కుండా వంద‌కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యంతో జ‌ట్టును పోటిలో ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మూడో రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి భార‌త్ 260/6తో నిలిచింది. ర‌హానే 89, శార్దూల్ 36 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 09 Jun 2023 03:54 PM (IST)

    సిక్స్‌తో ర‌హానే అర్ధ‌శ‌త‌కం

    ఆసీస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్న అజింక్య ర‌హానే ప్యాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో సిక్స్‌తో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 96 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో టెస్టుల్లో 26 హాఫ్ సెంచ‌రీని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

  • 09 Jun 2023 03:17 PM (IST)

    శ్రీక‌ర్ భ‌ర‌త్ ఔట్‌

    ఓవ‌ర్ నైట్ స్కోరు 151/5 తో టీమ్ఇండియా మూడో రోజు ఆట‌ను ప్రారంభించింది. మొద‌టి బంతికి ర‌హానే సింగిల్ తీయ‌గా రెండో బంతికే ప‌డింది. యువ ఆట‌గాడు శ్రీక‌ర్ భ‌ర‌త్(5) ఓవ‌ర్ నైట్ స్కోరుకు ఒక్క ప‌రుగు కూడా జోడించ‌కుండానే బొలాండ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 152 ప‌రుగుల వ‌ద్ద టీమ్ఇండియా ఆరో వికెట్ కోల్పోయింది.