World Cup:క్రికెట్ అభిమానుల‌కు పండ‌గే.. ఆసియా క‌ప్‌, ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫ్రీగా చూడొచ్చు

మ‌న‌దేశంలో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. మిగ‌తా ఆట‌ల సంగ‌తి ఎలా ఉన్నా స‌రే క్రికెట్ మ్యాచ్ వ‌స్తుందంటే చూసేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపిస్తుంటారు.

World Cup:క్రికెట్ అభిమానుల‌కు పండ‌గే.. ఆసియా క‌ప్‌, ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫ్రీగా చూడొచ్చు

Hotstar to stream world cup for free

World Cup 2023: మ‌న‌దేశంలో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. మిగ‌తా ఆట‌ల సంగ‌తి ఎలా ఉన్నా స‌రే క్రికెట్ మ్యాచ్ వ‌స్తుందంటే చూసేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. ముఖ్య‌మైన మ్యాచులు ఉంటే ఇక చెప్పాల్సిన ప‌ని లేదు. ఆఫీసులకు సెల‌వులు పెట్ట‌డం, కాలేజీల‌కు బంక్ కొట్ట‌డం వంటి చూస్తూనే ఉంటాం. అందుక‌నే క్రికెట్ మ్యాచ్‌ల బ్రాడ్ కాస్టింగ్‌, స్ట్రీమింగ్ హ‌క్కుల కోసం వేల కోట్ల‌ను వెచ్చిస్తుంటాయి కంపెనీలు.

మొన్న‌టి వ‌ర‌కు సంగ‌తి ఎలా ఉన్నా స‌రే డిజిటల్‌ ప్రసారాల‌పై జియో దృష్టి సారించ‌డంతో ప‌రిస్థితి మారిపోయింది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన జియో.. ఉచితంగానే మ్యాచుల‌ను చూసేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ న‌మోదైంది. చాలా మంది జియో సినిమా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అదే స‌మ‌యంలో గ‌తంలో మ్యాచ్‌ల‌ను డిజిట‌ల్ స్ట్రీమింగ్ చేసిన ప‌లు యాప్‌ల‌ మెంబ‌ర్ షిప్‌ల‌ను కొంత మంది వ‌దిలేసుకున్నారు.

Ajinkya Rahane: అజింక్య ర‌హానే అరుదైన ఘ‌న‌త‌.. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడేవారిలో కోహ్లి ఒక్క‌డే

ఈ క్ర‌మంలో ఆసియా క‌ప్‌, వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023 ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పింది. రానున్న ఆసియా క‌ప్‌తో పాటు ప్ర‌పంచ క‌ప్ మ్యాచుల‌ను త‌మ యాప్‌లో ఉచితంగా చూసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే.. ఇది మొబైల్‌లో మాత్ర‌మే. ల్యాప్‌టాప్‌, టీవీల్లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రికెట్ ను మ‌రింత మందికి చేరువ చేయాల‌నే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డిస్నీ+ హాట్‌స్టార్ తెలిపింది. దేశంలో 540 మిలియన్లకు పైగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన టోర్నీల‌ను ఉచితంగా వీక్షించ‌వ‌చ్చున‌ని చెప్పింది. కాగా..ట్యాబ్లెట్లలో మ్యాచ్‌లను చూసే వారికి కూడా ఈ ఉచిత ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది.

Steve Smith: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో స్టీవ్ స్మిత్ సెంచ‌రీ.. ప‌లు రికార్డులు బ్రేక్‌