Ranji Trophy 2024 : రంజీ క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. 78 ఏళ్ల‌లో ఇదే తొలిసారి..శ‌త‌కాల‌తో చెల‌రేగిన 10,11 నంబ‌ర్ బ్యాట‌ర్లు

రంజీట్రోఫీ 2024 సీజ‌న్‌లో అరుదైన రికార్డు న‌మోదైంది.

Ranji Trophy : రంజీట్రోఫీ 2024 సీజ‌న్‌లో అరుదైన రికార్డు న‌మోదైంది. ముంబై, బ‌రోడా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో 10, 11వ స్థానాల్లో వ‌చ్చిన బ్యాట‌ర్లు సెంచ‌రీలు చేశారు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇలా ఆఖ‌రి ఇద్ద‌రు బ్యాట‌ర్లు శ‌త‌కాలు చేయ‌డం ఇది రెండో సారి. ముంబై బ్యాట‌ర్లు తనూశ్‌ కొటియాన్‌ (120 నాటౌట్‌; 129 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు), తుషార్‌ దేశ్‌పాండే (123; 129 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) వ‌రుస‌గా 10వ‌, 11వ స్థానాల్లో బ‌రిలోకి దిగారు. వీరిద్ద‌రు శ‌త‌కాల‌తో అద‌ర‌గొట్టారు. ఆఖ‌రి వికెట్‌కు ఇద్ద‌రు 232 ప‌రుగులు జోడించారు.

1946లో మొద‌టి సారి..
ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 1946లో మొద‌టి సారి ఇలా 10వ‌, 11వ స్థానాల్లో వ‌చ్చిన ఆట‌గాళ్లు సెంచ‌రీలు చేశారు. స‌ర్రేతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త 10వ‌, 11వ నంబ‌ర్ ఆట‌గాళ్లు చందు స‌ర్వ‌తె (124 నాటౌట్‌), ఘ‌టె బెన‌ర్జీ (121) లు సెంచ‌రీలు చేశారు. 78 సంవ‌త్స‌రాల త‌రువాత తాజాగా మ‌రోసారి ఈ ఘ‌న‌త న‌మోదైంది.

BCCI : టెస్టు క్రికెట్ ఆడే ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌..! మ్యాచ్ ఫీజు పెంపు, బోనస్‌లు.. ఒక్క టెస్ట్ ఆడితే ఎంతొస్తుందంటే?

మూడో జోడీ..
ఆఖ‌రి వికెట్‌కు రెండు వంద‌ల ప‌రుగుల‌కు పైగా భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన మూడో జోడీగా తనూశ్‌-తుషార్‌ జోడి నిలిచింది. చందు-బెన‌ర్జీ జోడి (249), అజ‌య్ శ‌ర్మ‌-మ‌ణింద‌ర్ సింగ్ (233) లు మొద‌టి రెండు స్థానాల్లో ఉండ‌గా త‌నూశ్‌-తుషార్ లు 232 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.

Pro Kabaddi League 2024 : సెమీస్‌కు హర్యానా స్టీలర్స్‌.. గుజ‌రాత్ జెయింట్స్‌కు ఘోర ప‌రాభ‌వం

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై 384 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా బ‌రోడా 348 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో తనూశ్, తుషార్ ల‌తో పాటు ఓపెన‌ర్ హార్థ‌క్ తామోర్ (114) సెంచ‌రీ చేయ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 569 ప‌రుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం క‌లుపుకుని బ‌రోడా ముందు 606 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. అయితే.. ఆఖ‌రికి బ‌రోడా మూడు వికెట్లు 121 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించ‌డంతో ముంబై సెమీ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

 

ట్రెండింగ్ వార్తలు