Novak Djokovic: టెన్నిస్ ను ఏలడానికే వచ్చాడు.. జొకోవిచ్ రికార్డు ఇప్పట్లో చెరిగిపోదా!

కెరీర్ ఆరంభంలో తాను సాధించిన విజయాలు గాలివాటం కాదని.. టెన్నిస్ ను ఏలడానికే వచ్చాడని తర్వాత కాలంలో తన ఆటతో ఫ్రూవ్ చేశాడీ సెర్బియా స్టార్.

Novak Djokovic creates new record and clinch historic 24th Grand Slam

Novak Djokovic History: “టెన్నిస్ లో చరిత్ర సృష్టించడం నిజంగా ఎంతో విశేషమైనది, ప్రత్యేకమైనది. నేను ఇక్కడ 24 స్లామ్‌ల గురించి మాట్లాడతానని ఎప్పుడూ ఊహించలేదు. అది వాస్తవం అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ చరిత్ర సృష్టించడానికి నాకు అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం అనిపింది. ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకున్నాను. యూఎస్ ఓపెన్ పురుషులు సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత నోవాక్ జొకోవిచ్‌ చెప్పిన మాటలివి. ఇంటర్నేషల్ టెన్నిస్ హిస్టరీలో అతడు అత్యుత్తమ రికార్డు సాధించాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

నోవాక్ జొకోవిచ్‌.. టెన్నిస్ ప్రేమికులకు ఎంతగానో తెలిసిన పేరు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ లాంటి గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొని నంబర్ వన్ ప్లేస్ ను అందుకుని తనేంటో క్రీడా ప్రపంచానికి చాటిచెప్పాడు. కెరీర్ ఆరంభంలో తాను సాధించిన విజయాలు గాలివాటం కాదని.. టెన్నిస్ ను ఏలడానికే వచ్చాడని తర్వాత కాలంలో తన ఆటతో ఫ్రూవ్ చేశాడీ సెర్బియా స్టార్. ఫెదరర్, నాదల్ లాంటి ఉద్ధండులను దాటుకుని నంబర్ వన్ గా ఎదిగాడు. అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ పొజిషన్ ను కాపాడుకుంటూ యంగ్ ప్లేయర్స్ కూడా సవాల్ గా నిలిచాడు.

అభిమానులు జొకో అంటూ ప్రేమగా పిలుచుకునే 36 ఏళ్ల జొకోవిచ్ మైదానంలో చాలా అగ్రసివ్ గా ఉంటాడు. పదునైన షాట్లతో ప్రత్యర్థులపై నిర్దక్షిణ్యంగా విరుచుకుపడతాడు. 2003లో ప్రొఫెషన్ కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి అలసిపోకుండా టైటిల్స్ దాహం తీర్చుకుంటున్నాడు. కెరీర్ లో అప్పుడప్పుడు అటుపోట్లు ఎదుర్కొన్నా.. పడిలేచిన కెరటంలా పుంజుకుని టెన్నిస్ క్రీడలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఒక దశలో రఫెల్ నాదల్ తనను దాటుకుని ముందుకెళ్లినా.. జొకో వెనుకడుగు వేయలేదు. గాయాలు, వివాదాలతో కొద్ది రోజులు ఆటకు దూరమైనా అతడు నిరాశ చెందలేదు. సమరోత్సాహంతో సత్తా చాటి అత్యధిక టైటిల్స్ రికార్డు మళ్లీ తన పేరిట లఖించుకున్నాడు.

Also Read: మట్టికరిచిన మెద్వెదేవ్‌ 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన నోవాక్ జొకోవిచ్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను అత్యధికంగా 10 సార్లు గెలిచాడు. 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ దక్కించుకున్నాడు. ఒక సీజన్ లో మూడు గ్రాండ్ సామ్స్ 4 సార్లు గెలిచిన రికార్డు కూడా జొకోవిచ్ పేరిట ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ రారాజు రఫెల్ నాదల్ (22) మాత్రమే జొకోవిచ్ కు దగ్గరలో ఉన్నాడు. అయితే కొద్ది రోజులుగా నాదల్ ఆట లయ తప్పింది. ఇక మూడో స్థానంలో ఉన్న స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఇప్పటికే రిటైరయ్యాడు. దీన్ని బట్టి చూస్తే జొకోవిచ్ రికార్డు ఇప్పట్లో చెరిగిపోయేలా కనిపించడం లేదు!

Also Read: బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు

ట్రెండింగ్ వార్తలు