Novak Djokovic stunned fails to reach US Open 4th round
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనాలు నమోదు అవుతున్నాయి. టాప్ సీడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఇంటి ముఖం పడుతున్నారు. మొన్న 2022 ఛాంపియన్, మూడవ సీడ్ కార్లోస్ అల్కరాజ్ రెండవ రౌండ్‌లో ఓటమి పాలు కాగా తాజాగా రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ కూడా ఇంటి ముఖం పట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28 సీడ్ అలెక్స్ పాప్రియన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో గత 18 ఏళ్లలో యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకోవిచ్ ఇంటి ముఖం పట్టడం ఇదే తొలిసారి.
ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ 4-6, 4-6, 6-2, 4-6తో అలెక్స్ పాప్రియన్ ఓడించాడు. ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను జకోవిచ్ కోల్పోయాడు. అయితే.. మూడో సెట్‌ను సొంతం చేసుకోవడంతో ఇక జకోకు తిరుగులేదనిపించింది. అయితే మళ్లీ పుంజుకున్న అలెక్స్.. జకోకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నాలుగో సెట్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌లో విజయం సాధించాడు. దాదాపు 3 గంటల 19 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది.
Rahul Dravid : భారత అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కొడుకు.. ఆనందంలో మాజీ కోచ్
ఈ ఓటమితో రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకోవాలన్న జకోవిచ్ ఆశలు అడియాశలు అయ్యాయి.
ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్న బొప్పన్న జోడీ..
డబుల్స్‌లో రోహన్ బొప్పన్న-ఎబ్డెన్ జోడీ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో కార్బల్లెస్-కొరియా జోడీ పై 6-2, 6-4 తేడాతో విజయం సాధించారు.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని షాక్.. ఇక ఇప్పట్లో..
Alexei Popyrin just claimed the biggest win of his career! pic.twitter.com/iYcCxnWmfX
— US Open Tennis (@usopen) August 31, 2024