Numerical Coincidence : క్రికెట్‌లో అరుదైన క్ష‌ణం.. శతాబ్దానికి ఒక్క‌సారే ఇలా.. 11/11/11న 11:11కి .. 111 ప‌రుగులు

జెంటిల్‌మ‌న్ క్రీడ‌లో ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అయితే.. కొన్ని జ్ఞాప‌కాలు మాత్రం అభిమానుల గుండెల్లో చెద‌రని ముద్ర‌గా నిలిచిపోతాయి.

Numerical Coincidence

క్రికెట్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా మ‌న దేశంలో క్రికెట్‌ను ఓ ఆట‌గాలా కాదు ఓ మ‌తంగా భావిస్తారు. ఇక ఈ జెంటిల్‌మ‌న్ క్రీడ‌లో ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అయితే.. కొన్ని జ్ఞాప‌కాలు మాత్రం అభిమానుల గుండెల్లో చెద‌రని ముద్ర‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి 12 ఏళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున జ‌రిగింది. 11 న‌వంబ‌ర్ 2011న (11/11/11) ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో 11 నిమిషాల స‌మ‌యంలో ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి 111 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి.

ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్‌లో జ‌రిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 284 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 96 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 188 ప‌రుగుల మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అనూహ్యంగా కుప్ప‌కూలింది. 47 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

Sourav Ganguly, : ఇప్పుడున్న‌ది అత్యుత్త‌మ బౌలింగ్ ద‌ళం కాదు.. అప్ప‌ట్లో జ‌హీర్‌, నెహ్రా, శ్రీనాథ్‌..

టెస్టు మ్యాచ్ మూడో రోజు అంటే 11 న‌వంబ‌ర్ 2011 ఉద‌యం 11 గంట‌ల 11 నిమిషాల స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా స్కోరు 125 1. కాగా.. గెలిచేందుకు 111 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఇదీ ఓ యాధృశ్చ‌కం.. తేదీ 11/11/2011 కాగా.. ఉద‌యం 11.11 గంట‌ల‌కు 111 ప‌రుగులు కావడం. ఆటలో అరుదైన క్షణం. మరో శతాబ్ధం వరకు ఇలాంటి ఘటన పునరావృతమయ్యే అవకాశం లేదు. ఈ అరుదైన క్ష‌ణానికి గుర్తుగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ తో పాటు మైదానంలోని ప్రేక్ష‌కులు ఓ నిమిషం పాటు ఒంటి కాలిపై నిల‌బ‌డ్డారు.

ట్రెండింగ్ వార్తలు