Sourav Ganguly, : ఇప్పుడున్నది అత్యుత్తమ బౌలింగ్ దళం కాదు.. అప్పట్లో జహీర్, నెహ్రా, శ్రీనాథ్..
Ganguly comments on Indian Bowling Attack : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అదరగొడుతోంది.

Ganguly comments on Indian Bowling Attack
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడిన భారత్ అన్నింటిలోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మెగా టోర్నీలో ఓటమే ఎగురని జట్టుగా కొనసాగుతోంది. భారత విజయాల్లో టీమ్ఇండియా పేస్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. అద్భుతమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతోంది.
జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లతో కూడిన ప్రేస్ త్రయం ఇప్పటి వరకు 41 వికెట్లు పడగొట్టారు. భారత పేస్ త్రయం పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పేస్ దళం ఇదేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.

Bumrah-Shami-Siraj
అయితే.. వారి అభిప్రాయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తోసిపుచ్చాడు. ఇదే అత్యుత్తమ పేస్ దళం అని తాను చెప్పనని అన్నాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో కూడా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడు.
Dhoni Autograph : అభిమాని బీఎండబ్ల్యూ కారుపై ఆటోగ్రాఫ్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. వీడియో వైరల్
ఆ ప్రపంచకప్‌లో జహీన్ ఖాన్, ఆశిష్ నెహ్రా, జవగళ్ శ్రీనాథ్‌లతో లు చాలా చక్కగా బౌలింగ్ చేశారని గంగూలీ ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు. కాగా.. బుమ్రా, షమీ, సిరాజ్ లు ఇలా బౌలింగ్ చేస్తుండడం చూసేందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. బుమ్రా జట్టులో ఉన్నప్పుడు అతడు మిగతా బౌలర్ల పై కూడా ప్రభావం చూపుతాడని గంగూలీ అన్నారు. ఇక మహ్మద్ షమీ ఈ టోర్నీ ఆరంభంలోని నాలుగు మ్యాచులకు బెంచీకే పరిమితం అయ్యాడు. ఆ నాలుగు మ్యాచుల్లోనూ షమీ ఆడాల్సి ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Zaheer-Nehra-Srinath
Ganguly : గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ చూసి.. జడేజా ఏడ్చే ఉంటాడు
ఈ ప్రపంచకప్‌లో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. టీమ్ఇండియా ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుతో టీమ్ఇండియా ఆడనుంది.