Ganguly : గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ చూసి.. జ‌డేజా ఏడ్చే ఉంటాడు

Sourav Ganguly Comments : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఉత్త‌మ ఇన్నింగ్స్‌ల్లో ఒక‌టిగా నిలిచే ఇన్నింగ్స్ ను అఫ్గానిస్థాన్ పై మాక్స్‌వెల్ ఆడిన సంగ‌తి తెలిసిందే.

Ganguly : గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ చూసి.. జ‌డేజా ఏడ్చే ఉంటాడు

Sourav Ganguly Comments

క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఉత్త‌మ ఇన్నింగ్స్‌ల్లో ఒక‌టిగా నిలిచే ఇన్నింగ్స్ ను అఫ్గానిస్థాన్ పై మాక్స్‌వెల్ ఆడిన సంగ‌తి తెలిసిందే. 293 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 91 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి ఓట‌మి దిశ‌గా సాగింది. అయితే.. ఆల్‌రౌండ‌ర్ మాక్స్‌వెల్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ డ‌బుల్ సెంచ‌రీతో ఆసీస్‌కు న‌మ్మ‌శ‌క్యం గాని విజయాన్ని అందించాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 201 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.

జ‌డేజా పాత్ర కీల‌కం..

Ajay Jadeja

Ajay Jadeja

ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్థాన్ అద‌ర‌గొట్టింది. నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, నెద‌ర్లాండ్స్‌ను ఓడించి సెమీస్ రేసులో నిలిచింది. అయితే.. చివ‌రి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా చేతుల్లో ఓడి సెమీస్ చేర‌కుండానే టోర్నీ నుంచి నిష్ర్క‌మించింది. అఫ్గానిస్థాన్ జ‌ట్టు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో రాణించ‌డం వెనుక టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా పాత్ర ఎంతో ఉంది అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మెంటార్‌గా అత‌డి మార్గ‌నిర్దేశ‌నంలో అఫ్గాన్‌ మెరుగ్గా రాణించింది.

గంగూలీ షాకింగ్ కామెంట్లు..

మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ పై భార‌త మాజీ క్రికెటర్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మాక్స్‌వెల్‌ను ఔట్ చేసేందుకు అఫ్గానిస్థాన్ బౌల‌ర్లు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా అనిపించ‌లేద‌న్నాడు. కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో మాక్స్‌వెల్ ఇబ్బందులు ప‌డుతుంటే.. ఎక్కువ‌గా స్ట్రైయిట్ బాల్స్ వేసి అత‌డు చాలా సుల‌భంగా బౌండ‌రీలు కొట్టే అవ‌కాశాన్ని అఫ్గాన్ బౌల‌ర్లు క‌ల్పించార‌ని అన్నారు. ఏడ‌వ స్టంప్ పై బౌలింగ్ చేసి ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అభిప్రాయ ప‌డ్డాడు.

Sourav Ganguly

Sourav Ganguly

91 ప‌రుగులకే ఏడు వికెట్లు ప‌డ‌గొట్టిన అఫ్గాన్ బౌల‌ర్లు ఆ త‌రువాత ప‌రిస్థితుల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం అయ్యార‌ని అన్నాడు. ఇదంతా మైదానంలోంచి ప్ర‌త్య‌క్షంగా చూసిన జ‌డేజా ఖ‌చ్చితంగా ఏడ్చే ఉంటాడ‌ని గంగూలీ చెప్పారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ మాక్స్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ వ‌న్డేల్లో ఓ గొప్ప ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంద‌ని తెలిపారు.