Dhoni Autograph : అభిమాని బీఎండబ్ల్యూ కారుపై ఆటోగ్రాఫ్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. వీడియో వైరల్
ధోనీతో ఫొటో తీసుకునేందుకు, ఆటో గ్రాఫ్ కోసం అభిమానులు పోటీ పడుతుంటారు. ధోనీసైతం ఓపిగ్గా అభిమానులతో సెల్ఫీలు దిగడం మనం చూస్తూనే ఉంటాం.

MS Dhoni
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీని క్రికెట్ పై అవగాహన ఉన్న ప్రతిఒక్కరూ ఇష్టపడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధోనీ కెప్టెన్సీ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ నుసైతం కైవసం చేసుకుంది. ధోనీ ఆటతీరు, ప్రవర్తనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్డ్ అయిన తరువాత ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ధోనీ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది.
ధోనీతో ఫొటో తీసుకునేందుకు, ఆటో గ్రాఫ్ కోసం అభిమానులు పోటీ పడుతుంటారు. ధోనీసైతం ఓపిగ్గా అభిమానులతో సెల్ఫీలు దిగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ అభిమానికి చెందిన నూతన బీఎండబ్ల్యూ కారుపై మహేంద్ర సింగ్ ధోనీ ఆటో గ్రాఫ్ పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Video of the day : MS Dhoni delights a fan by giving autograph on the car ?❤️@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/mxd2mFdqnH
— DHONIsm™ ❤️ (@DHONIism) November 10, 2023
ఓ అభిమాని బీఎండబ్ల్యూ కారుపై సంతకం చేయాలని కోరాడు. ధోనిసైతం అందుకు అంగీకరించి బీఎండబ్ల్యూ కారు వెనుక సీట్లో కూర్చొని చాలా జాగ్రత్తగా సీటు మధ్య భాగంలో ఆటోగ్రాఫ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనీ అభిమానుల పట్ల చూపుతున్న మర్యాదను తెగ మెచ్చుకుంటున్నారు.