India vs Netherlands Match
India vs Netherlands Match : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఆది నుంచి ఫోర్లు, సిక్సర్ల మోతమోగించారు. రోహిత్, గిల్, విరాట్ కోహ్లీలు ఆఫ్ సెంచరీలు చేయగా.. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేశారు. దీంతో 50 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 410 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ జట్టు 250 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్స్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు.
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బీసీసీఐ ఆధ్వర్యంలో భారత్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ టీమిండియా ఆడే మ్యాచ్ లలో అద్భుతమైన ఫీల్డింగ్ తో, క్యాచ్ తో ఆకట్టుకున్న వారికి బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ పేరిట అవార్డును అందిస్తున్నారు. ప్రతీ మ్యాచ్ తరువాత ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రతీసారి అవార్డు అందజేలో కొత్తదనం చూపుతున్నారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్ – ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో బెస్ట్ ఫీల్డింగ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సూర్యకుమార్ యాదవ్ కు దక్కింది. అయితే, ఈసారి ఈ అవార్డును వెరైటీగా అందించారు.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో నుంచి టీమిండియా ప్లేయర్స్ మైదానంలోకి వచ్చారు. ఆ తరువాత అందరి సమక్షంలో బెస్ట్ ఫీల్డర్ అవార్డుకు సూర్యకుమార్ యాదవ్ పేరును దిలీప్ ప్రకటించారు. దీంతో తోటి క్రీడాకారులు సూర్యను అభినందనలతో ముంచెత్తారు. అయితే, సూర్య పేరును వెరైటీగా ప్రకటించారు. మైదానంలో ఐదుగురు వ్యక్తులు SURYA ఇంగ్లీష్ లెటర్స్ తో విడివిడిగా బోర్డులు పట్టుకొని సూర్య పేరును ప్రదర్శించారు. అనంతరం సూర్య మైదానంలో వారితో ఫొటోలు దిగారు.
When the "Decision is pending" & you get the groundsmen for the BIG reveal ???
Heartwarming & innovative from #TeamIndia in this edition of the Best fielder award? #CWC23 | #MenInBlue | #INDvNED
WATCH ?? – By @28anand
— BCCI (@BCCI) November 13, 2023