Tamil superstar Rajinikanth
ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం నేడు మొదలవనుంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెడుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఓటమి లేకుండా ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా సెమీస్ లోనూ కివీస్ ను మట్టి కరిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.
వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ కివీస్ మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు పలువురు సెలెబ్రెటీలుకూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యాచ్ ను వీక్షించేందుకు బయలుదేరి వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వచ్చిన రజనీకాంత్.. ఎయిర్ పోర్టు వెలుపల గుమికూడిన మీడియాతో మాట్లాడాడు. ‘నేను ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ చూడబోతున్నాను’ అని పేర్కొన్నారు. కొన్ని గంటల తరువాత రంజనీకాంత్ ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. రజనీకాంత్ తో పాటు అతని సతీమణి లతా రజనీకాంత్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో కివీస్ ఐదుసార్లు, భారత్ జట్టు నాలుగు సార్లు గెలిచింది. ఈ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో కివీస్ పై భారత్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. లీగ్ దశలో జరిగిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధించి భారత్ జట్టు కొండంత ఆత్మవిశ్వాసంతో సెమీస్ లో కివీస్ ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు విజయానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
#WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai.
"I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX
— ANI (@ANI) November 14, 2023