Aishwarya Rai : పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. భార‌తీయ న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకుని ఉంటే..?

Aishwarya Rai-Abdul Razzaq : అబ్దుల్ ర‌జాక్ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును విమ‌ర్శించే క్ర‌మంలో భార‌త న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ ప్ర‌స్తావ‌న తెచ్చాడు.

Aishwarya Rai : పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. భార‌తీయ న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకుని ఉంటే..?

Aishwarya Rai-Abdul Razzaq

Aishwarya Rai-Abdul Razzaq : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ ప్ర‌స్థానం ముగిసింది. సెమీస్ చేర‌కుండానే ఆ జ‌ట్టు టోర్నీ నుంచి నిష్ర్క‌మించింది. ఈ మెగాటోర్నీలో తొమ్మిది మ్యాచులు ఆడిన పాకిస్థాన్ నాలుగు మ్యాచుల్లో గెలిచింది. మ‌రో ఐదు మ్యాచుల్లో ఓడిపోవ‌డంతో ఇంటి ముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు. ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ ప్ర‌ద‌ర్శ‌న పై ఆ దేశంలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. అభిమానుల‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెట‌ర్లు పాక్ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో క‌రాచీలో జ‌రిగిన ఓ క్రీడా చ‌ర్చా కార్య‌క్ర‌మంలో మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సల్మాన్ బట్ ల‌తో పాటు మాజీ ఫాస్ట్ బౌల‌ర్ అబ్దుల్ ర‌జాక్ పాల్గొన్నాడు. పాకిస్థాన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న పై వారు మాట్లాడారు. ఈక్ర‌మంలో అబ్దుల్ ర‌జాక్ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అత‌డు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును విమ‌ర్శించే క్ర‌మంలో భార‌త న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ ప్ర‌స్తావ‌న తెచ్చాడు.

ర‌జాక్ ఏం మాట్లాడ‌డంటే..?

పాకిస్థాన్ క్రికెట్ ప్ర‌స్తుతం సంధికాలంలో ఉంద‌ని త‌న‌కు అనిపిస్తోంద‌న్నాడు. కెప్టెన్ అనేవాడు ఎల్ల‌ప్పుడూ జ‌ట్టుకు స్ఫూర్తిని ఇచ్చేలా ఉండాల‌ని వ్యాఖ్యానించాడు. తాను జాతీయ జ‌ట్టుకు ఆడే స‌మ‌యంలో అప్ప‌టి కెప్టెన్ యూనిస్ ఖాన్ త‌న‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించేవాడ‌ని గుర్తు చేసుకున్నాడు. త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను మెరుగుప‌ర‌చుకునేందుకు యూనిస్ ఖాన్ అనేక స‌ల‌హాలు ఇచ్చేవాడ‌ని ర‌జాక్ చెప్పాడు.

Also Read: భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైన‌ల్‌.. టికెట్ ల‌క్షా20 వేలు.. వ్య‌క్తి అరెస్ట్‌..!

వాటిని పాటించ‌డం వ‌ల్ల త‌న‌లో ఆత్మ‌విశ్వాసం పెరిగేద‌న్నాడు. అయితే.. ప్ర‌స్తుత జ‌ట్టులో అలాంటి వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌న్నాడు. ఈ విష‌యాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా స‌రిగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్పాడు. ఆట‌గాళ్ల‌లో అంకిత‌భావం లోపించింద‌ని తెలిపాడు. చిత్త‌శుద్ధి, అంకిత‌భావం లేకుంటే ఇలాంటి ఫ‌లితాలే వ‌స్తాయ‌న్నాడు. తాను ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకుంటే అంద‌మైన, మంచి పిల్ల‌లు పుడ‌తార‌ని అనుకుంటే.. అది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌న్నాడు. పీసీబీ తీసుకునే నిర్ణ‌యాలు బాగుంటేనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పాడు.

Also Read: ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌.. పాకిస్థాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

మండిప‌డుతున్న నెటీజ‌న్లు..

అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మార‌గా భార‌త అభిమానులు మండిప‌డుతున్నారు. పీసీబీ విమ‌ర్శించ‌డం అత‌డి ఇష్ట‌మ‌ని, మ‌ధ్య‌లో ఐశ్వ‌ర్య‌రాయ్‌ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం న‌చ్చ‌లేదంటున్నారు.