ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌.. పాకిస్థాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్థాన్ ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సెమీస్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది.

ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌.. పాకిస్థాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

Pakistan

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్థాన్ ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సెమీస్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. టోర్నీ ఆరంభంలో టైటిల్ ఫేవ‌రెట్ల‌ల‌లో ఒక‌టిగా ఉన్న పాక్ ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ జ‌ట్టు పై విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఆ జ‌ట్టు అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు కూడా పాక్ ప్ర‌ద‌ర్శ‌న పై మండిప‌డుతున్నారు.

కొంద‌రు బాబ‌ర్ ఆజాంను కెప్టెన్సీ నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంద‌రు కోచింగ్ బృందాన్ని మార్చాల‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్ బౌల‌ర్ల వైఫ‌ల్యానికి బాధ్య‌త వ‌హిస్తూ ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు మోర్నే మోర్కెల్ ఇప్ప‌టికే రాజీనామా చేశాడు. ఇదే స‌మ‌యంలో పాక్‌ జట్టు పేలవ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో పీసీబీ కఠిన చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Morne Morkel

Morne Morkel

IND vs NZ : భార‌త్‌, న్యూజిలాండ్ సెమీ ఫైన‌ల్‌ మ్యాచ్.. చూసేందుకు రానున్న విశిష్ట అతిథి.. ఎవ‌రో తెలుసా..?

విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని తొల‌గించాల‌ని పీసీబీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పాకిస్థాన్ కు చెందిన సామా టీవీ పేర్కొంది. టీమ్ డైరెక్ట‌ర్ మిక్కీ ఆర్థ‌ర్ కూడా ఈ జాబితాలో ఉన్న‌ట్లు తెలిపింది. ఇప్ప‌టికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రాఫ్ ఉన్నతాధికారులతో ఇదే అంశంపై చర్చలు జ‌రిపారట‌. మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ సహా పలువురు అగ్రశ్రేణి మాజీ ఆటగాళ్లు కూడా జాకా అష్రాఫ్‌ను చ‌ర్చించార‌ని చెప్పింది.

Mickey Arthur

Mickey Arthur

ఐదో స్థానంలో..

ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా అడుగుపెట్టింది పాకిస్థాన్‌. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే మొద‌టి రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఆ త‌రువాతే క‌థ అడ్డం తిరిగింది. వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లోనూ ఓట‌మి పాలైంది. దీంతో పాకిస్థాన్ సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఆ త‌రువాత రెండు మ్యాచుల్లో గెలిచినా ఆఖ‌రి మ్యాచ్‌లో ఓట‌మి పాలు కావ‌డంతో పాకిస్థాన్ సెమీస్ అవ‌కాశాలు గ‌ల్లంతు అయ్యాయి.

Rachin Ravindra : రాహుల్, సచిన్ పేర్ల కలయికతో ‘రచిన్’ పేరు పెట్టారా? అసలు విషయం చెప్పిన రచిన్ తండ్రి

మొత్తంగా ఈ మెగాటోర్నీలో లీగ్ ద‌శ‌లో తొమ్మిది మ్యాచులు ఆడిన పాకిస్థాన్ నాలుగు మ్యాచుల్లో గెలిచింది. మ‌రో ఐదు మ్యాచుల్లో ఓడిపోయి 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఆ జ‌ట్టు పై విమ‌ర్శ‌ల ప‌ర్వం మొద‌లైంది. కాగా.. 1992లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచిన పాకిస్థాన్ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోసారి క‌ప్‌ను ముద్దాడ‌లేదు. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ జ‌ట్టు డిసెంబ‌ర్ 14 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడ‌నుంది.