Rachin Ravindra : రాహుల్, సచిన్ పేర్ల కలయికతో ‘రచిన్’ పేరు పెట్టారా? అసలు విషయం చెప్పిన రచిన్ తండ్రి

భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర పేరును రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లు కలిసివచ్చేలా పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంపై రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చాడు.

Rachin Ravindra : రాహుల్, సచిన్ పేర్ల కలయికతో ‘రచిన్’ పేరు పెట్టారా? అసలు విషయం చెప్పిన రచిన్ తండ్రి

Rachin Ravindra

ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ -2023లో న్యూజిలాండ్ యువ ప్లేయర్ రచిన్ రవీంద్ర అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. మెగా టోర్నీలో తొమ్మిది మ్యాచ్ లలో మూడు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలతో 556 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రచిన్ రవీంద్రపై ప్రత్యేక దృష్టిసారిస్తారనడంలో అతిశయోక్తి లేదు.

Also Read : IND vs NZ : తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో పరుగుల వరద ఖాయమా?.. వాంఖడే స్టేడియంలో గణాంకాలు చూస్తే ..

నిజానికి రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన వ్యక్తి. అతని తాతలు బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల రవీంద్ర తన అమ్మమ్మవాళ్ల ఇంటికి వెళ్లి ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. అయితే, రచిన్ అనే పేరును రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లు కలిపి పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి. అతని క్రికెట్ తో అనుబంధం ఉంది. రాహుల్, సచిన్ టెండూల్కర్ అంటే అతని ఇష్టం. దీంతో వారిద్దరి పేర్లు కలిసొచ్చేలా తన కుమారుడికి ‘రచిన్’ అని పేరుపెట్టిన ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై తాజాగా రవి కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చాడు.

Also Read : ODI World Cup 2023 : వరల్డ్ కప్ లో శ్రీలంక చెత్త ప్రదర్శనకు జైషానే కారణమట.. అర్జున్ రణతుంగ సంచలన వ్యాఖ్యలు

ఓ ఆంగ్ల న్యూస్ మీడియాతో రవి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రచిన్ పుట్టినప్పుడు నా భార్య ఈపేరును సూచించిందని, మేము దాని గురించి చర్చించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదని చెప్పాడు. పేరు బాగుంది. ఉచ్చరించడానికి సులభంగా ఉంది. దీంతో మేము రచిన్ అనే పేరును పెట్టడం జరిగిందని తెలిపారు. రాహుల్ ద్రవిడ్, సచిన్ పేర్లు కలిసొచ్చేలా రచిన్ అనే పేరును పెట్టినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రవి కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చాడు.