IND vs NZ : తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో పరుగుల వరద ఖాయమా?.. వాంఖడే స్టేడియంలో గణాంకాలు చూస్తే ..

వాంఖడే స్టేడియంలో వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటింగ్ కు ముందు, తర్వాత మొదటి పవర్ ప్లే (1-10 ఓవర్లు) గణాంకాలను మాత్రమే పరిశీలిస్తే.. మొదటి పవర్ ప్లే లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ..

IND vs NZ : తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో పరుగుల వరద ఖాయమా?.. వాంఖడే స్టేడియంలో గణాంకాలు చూస్తే ..

IND vs NZ Match

ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా అద్భుత ఫామ్ తో దూసుకెళ్తోంది. లీగ్ దశలో వరుసగా తొమ్మిది మ్యాచ్ లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో పాయింట్ల పట్టికలో నాల్గో ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ లో పరుగుల వరదపారడం ఖాయంగా కనిపిస్తోంది. మెగా టోర్నీలో లీగ్ దశలో న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. సెమీస్ పోరులో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఈ మ్యాచ్ కు టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read : Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వరల్డ్ కప్ లో వాంఖడే మైదానంలో జరిగిన నాలుగు మ్యాచ్ ల గణాంకాలను పరిశీలిస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అయితే.. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా విజయం సాధించింది.దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగ్గా తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 382 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు 149 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 399 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టును కేవలం 170 పరుగులకే ఔట్ చేసింది. శ్రీలంక వర్సెస్ టీమిండియా మ్యాచ్ లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయింది. అయితే, ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 291 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ కారణంగా ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని విజయం సాధించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Also Read : ODI World Cup 2023 : వరల్డ్ కప్ లో శ్రీలంక చెత్త ప్రదర్శనకు జైషానే కారణమట.. అర్జున్ రణతుంగ సంచలన వ్యాఖ్యలు

వాంఖడే స్టేడియంలో వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటింగ్ కు ముందు, తర్వాత మొదటి పవర్ ప్లే (1-10 ఓవర్లు) గణాంకాలను మాత్రమే పరిశీలిస్తే.. మొదటి పవర్ ప్లే లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 1 వికెట్ నష్టానికి 52 పరుగులు. రెండో ఇన్నింగ్స్ లో ఈ స్కోరు 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులకు తగ్గింది. ఈ గణాంకాలనుబట్టి చూస్తే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టే పవర్ ప్లేలో భారీ పరుగులు రాబట్టగలుగుతుంది. ఒకవేళ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే తొలుత 20 ఓవర్లు వికెట్లు చేజార్చుకోకుండా క్రీజులో పాతుకుపోవాల్సి ఉంటుంది. ఆ తరువాత బ్యాటింగ్ సులభతరం అవుతుంది. చివరి 30 ఓవర్లు వాంఖడే స్టేడియంలో బ్యాటింగ్ చేయడం సులభంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం టీమిండియా ఆడే తొలి సెమీఫైనల్స్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని కోరుకుందాం.