ODI World Cup 2023: ఆ రెండు జట్లకు కలిసొచ్చిన న్యూజిలాండ్ ఓటమి.. సెమీస్ లోకి పాక్ ఎంట్రీ ఖాయమా?

న్యూజిలాండ్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి 8 పాయింట్లతో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తే కివీస్ నాల్గో ప్లేస్ లో సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.

pakistan

ODI World Cup 2023 Semi Final : ప్రపంచ కప్ 2023లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారుతుంది. లీగ్ దశలో మరో 13 మ్యాచ్ లే ఉండటంతో సెమీఫైనల్ లోకి అడుగుపెట్టే జట్లు అంచనా వేయటం కష్టంగా మారుతుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు సెమీఫైనల్ లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. మూడో ప్లేస్ లో ఆస్ట్రేలియా పాతుకుపోయేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఎనిమిది పాట్లతో మూడో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో కనీసం రెండు గెలిచినా ఆసీస్ సెమీఫైనల్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : India vs Sri Lanka Live Match Updates : రోహిత్ శ‌ర్మ క్లీన్ బౌల్డ్.. ఆచితూచి ఆడుతున్న క్లోహ్లీ, గిల్‌

నాల్గో స్థానంకోసం మూడు జట్లు పోటీ ..
సెమీ ఫైనల్ పోరులో నాల్గో స్థానంకోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. బుధవారం దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. న్యూజిలాండ్ ఓటమి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లకు కలిసొచ్చింది. ఇక శ్రీలంక భారత్ జట్టుపై విజయం సాధిస్తే సెమీస్ కు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. లేకుంటే ఆ జట్టు సెమీస్ కు వెళ్లే అర్హత కోల్పోతుంది. అఫ్గానిస్థాన్ కు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నా.. మిగిలిన మూడు మ్యాచ్ లు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఆ జట్టు నెదర్లాండ్స్ తో గెలిచే అవకాశాలు ఉన్నా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లపై విజయం సాధించటం కొంచెం కష్టమనే చెప్పొచ్చు. అయితే, ప్రస్తుతం అఫ్గాన్ జట్టు మంచి ఫామ్ లో ఉండటంతో ఆ జట్టు సైతం సెమీస్ రేసులో విజయం సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Also Read : ODI World Cup 2023 : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ప్రపంచ కప్ నుంచి ఆ జట్టు ఆల్ రౌండర్ ఔట్.. ఎందుకంటే?

ఆ మ్యాచ్ కీలకం ..!
న్యూజిలాండ్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి 8 పాయింట్లతో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తే కివీస్ నాల్గో ప్లేస్ లో సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. కానీ.. కివీస్ 4న బెంగళూరులో పాకిస్థాన్ జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలిస్తే వాళ్లు సెమీ ఫైనల్ పోరుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ 4న జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధిస్తే.. పాక్ ఎనిమిది పాయింట్లకు చేరుతుంది. ఆ తరువాత రెండు జట్లు చెరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ మరో మ్యాచ్ శ్రీలంకతో ఆడుతుంది. అక్కడకూడా ఓడిపోయితే కివీస్ సెమీస్ ఆశలు వదిలుకోవాల్సిందే. పాకిస్థాన్ మరో మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఒకవేళ పాక్ విజయం సాధిస్తే కివీస్ స్థానంలో నాల్గో ప్లేస్ లో సెమీఫైనల్ కు చేరుతుంది. అలాకాకుండా పాకిస్థాన్ ఇంగ్లాండ్ పై ఓడిపోయి.. న్యూజిలాండ్ శ్రీలంకపై గెలిస్తే కివీస్ కు సెమీస్ అవకాశాలు ఉంటాయి.

Also Read : IND vs SL Match: లంకతో భారత్ ఢీ.. 12ఏళ్ల క్రితం ఫలితం పునరావృతం అవుతుందా? వాళ్లకు లాస్ట్ ఛాన్స్..

అఫ్గాన్, శ్రీలంక పరిస్థితి..
అఫ్గాన్ విషయానికొస్తే ఆరు మ్యాచ్ లు ఆడి ఆరు పాయింట్లు కలిగి ఉంది. మరో మూడు మ్యాచ్ లు (నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా) ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఆ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కనీసం రెండు మ్యాచ్ లలో మంచి రన్ రేటుతో విజయం సాధించినా ఇతర జట్ల పరిస్థితిని బట్టి సెమీస్ కు వెళ్లే అవకాశాలుకూడా ఉంటాయి. శ్రీలంక జట్టుకు సెమీస్ అవకాశాలు దాదాపు కష్టమనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆరు మ్యాచ్ లలో నాలుగు పాయింట్లతో ఆ జట్టు ఉంది. శ్రీలంక సెమీస్ వెళ్లాలంటే కచ్చితంగా మూడు మ్యాచ్ లు గెలవాల్సి ఉంది. అప్పటికీ ఆ జట్టు సెమీస్ కు వెళ్లాలంటే న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.