India vs Sri Lanka : భార‌త్ ఘ‌న విజ‌యం.. చిత్తు చిత్తుగా ఓడిన శ్రీలంక‌

World Cup 2023 IND Vs SL : స్వదేశంలో జ‌రుగుతున్న‌న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది.

India vs Sri Lanka : భార‌త్ ఘ‌న విజ‌యం.. చిత్తు చిత్తుగా ఓడిన శ్రీలంక‌

India vs Sri Lanka

Updated On : November 2, 2023 / 8:37 PM IST

India vs Sri Lanka 2023 : వాంఖ‌డే వేదిక‌గా టీమ్ఇండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 02 Nov 2023 08:36 PM (IST)

    55 ప‌రుగుల‌కే శ్రీలంక ఆలౌట్‌

    358 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీలంక 19.4 ఓవ‌ర్ల‌లో 55 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో భార‌త్ 302 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది.

  • 02 Nov 2023 08:29 PM (IST)

    ర‌జిత ఔట్‌..

    ష‌మి బౌలింగ్‌లో క‌సున్ ర‌జిత (14) శుభ్‌మ‌న్ గిల్ చేతికి చిక్కాడు. దీంతో 49 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

  • 02 Nov 2023 08:07 PM (IST)

    మాథ్యూస్ క్లీన్ బౌల్డ్..

    మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో మాథ్యూస్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో దీంతో 13.1వ‌ ఓవ‌ర్‌లో 29 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

  • 02 Nov 2023 08:02 PM (IST)

    చ‌మీర ఔట్‌..

    మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో చ‌మీర (0) ఔట్ అయ్యాడు. దీంతో 11.3వ ఓవ‌ర్‌లో 22 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది.

  • 02 Nov 2023 07:41 PM (IST)

    10 ఓవ‌ర్ల‌కు శ్రీలంక స్కోరు 14/6

    శ్రీలంక జ‌ట్టు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 14 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు శ్రీలంక స్కోరు 14/6. చ‌మీర (0), ఏంజెలో మాథ్యూస్ (7) లు ఆడుతున్నారు.

  • 02 Nov 2023 07:05 PM (IST)

    మూడు ప‌రుగుల‌కు నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక‌

    భారీ లక్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలోకి దిగిన శ్రీలంక త‌డ‌బడుతోంది. మూడు ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ మూడు వికెట్లు తీయ‌గా, బుమ్రా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. 4 ఓవ‌ర్ల‌కు శ్రీలంక స్కోరు 7/4. చరిత్ అస‌లంక (0), ఏంజెలో మాథ్యూస్ (4) లు ఆడుతున్నారు.

  • 02 Nov 2023 06:06 PM (IST)

    శ్రీలంక టార్గెట్.. 358

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 357 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (88 ;94 బంతుల్లో 11 ఫోర్లు) లు తృటిలో శ‌త‌కాలు చేజార్చుకున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శ‌ర్మ (4) విఫ‌లం కాగా.. కేఎల్ రాహుల్ (21), ర‌వీంద్ర జ‌డేజా (35) లు రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మ‌ధుశంక ఐదు వికెట్లు తీశాడు. చ‌మీర ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

  • 02 Nov 2023 05:54 PM (IST)

    శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీ మిస్‌..

    మ‌ధుశంక బౌలింగ్‌లో మ‌హేశ్ తీక్ష‌ణ క్యాచ్ అందుకోవ‌డంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 47.3వ ఓవ‌ర్‌లో 333 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

  • 02 Nov 2023 05:28 PM (IST)

    శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ..

    మ‌హేశ్ తీక్ష‌ణ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ 36 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

  • 02 Nov 2023 05:23 PM (IST)

    సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌..

    భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మధుశంక బౌలింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (12) కుశాల్ మెండీస్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 41.3వ ఓవ‌ర్‌లో 276 ప‌రుగ‌ల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

  • 02 Nov 2023 05:10 PM (IST)

    కేఎల్ రాహుల్ ఔట్‌..

    చ‌మీర బౌలింగ్‌లో హేమంత క్యాచ్ అందుకోవ‌డంతో కేఎల్ రాహుల్ (21; 19 బంతుల్లో 2 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 39.2 ఓవ‌ర్‌లో 256 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 02 Nov 2023 04:34 PM (IST)

    కోహ్లీ ఔట్‌..

    భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌ధుశంక బౌలింగ్‌లో పాతుమ్ నిస్సాంక క్యాచ్ అందుకోవడంతో విరాట్ కోహ్లీ (88; 94 బంతుల్లో 11 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 31.3వ ఓవ‌ర్‌లో 196 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 02 Nov 2023 04:30 PM (IST)

    గిల్ శ‌త‌కం మిస్‌

    భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌ధుశంక బౌలింగ్‌లో కుశాల్ మెండీస్ క్యాచ్ అందుకోవడంతో 193 ప‌రుగుల వ‌ద్ద గిల్ (92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రెండో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు.

  • 02 Nov 2023 03:46 PM (IST)

    గిల్ హాఫ్ సెంచ‌రీ

    హేమంత బౌలింగ్‌లో(18.3వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి 55 బంతుల్లో 8 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 120/1. గిల్ (53), కోహ్లీ (54) లు ఆడుతున్నారు.

  • 02 Nov 2023 03:28 PM (IST)

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ

    దుషన్ హేమంత బౌలింగ్‌లో(16.1వ ఓవ‌ర్‌) రెండు ప‌రుగులు తీసి 50 బంతుల్లో 8 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 17 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 106/1. గిల్ (41), కోహ్లీ (52) లు ఆడుతున్నారు.

  • 02 Nov 2023 02:29 PM (IST)

    5 ఓవ‌ర్ల‌కు టీమ్ఇండియా స్కోరు 25/1

    కోహ్లీ , గిల్ లు ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవ‌ర్ల‌కు టీమ్ఇండియా స్కోరు 25/1. విరాట్ కోహ్లీ (10), గిల్ (9) ఆడుతున్నారు.

  • 02 Nov 2023 02:08 PM (IST)

    రోహిత్ శ‌ర్మ క్లీన్ బౌల్డ్

    మొద‌టి ఓవ‌ర్‌లోనే టీమ్ ఇండియాకు షాక్ త‌గిలింది. మ‌ధుశంక బౌలింగ్‌లో మొద‌టి బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ శ‌ర్మ రెండో బంతికి ఔట్ అయ్యాడు. 1 ఓవ‌ర్‌కు టీమ్ ఇండియా స్కోరు 8/1. విరాట్ కోహ్లీ (4), గిల్ (0) ఆడుతున్నారు.

  • 02 Nov 2023 01:40 PM (IST)

    శ్రీలంక తుది జ‌ట్టు

    పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

  • 02 Nov 2023 01:39 PM (IST)

    భారత తుది జ‌ట్టు

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

  • 02 Nov 2023 01:36 PM (IST)

    టాస్ గెలిచిన శ్రీలంక‌..

    టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. భార‌త జ‌ట్టులో ఎటువంటి మార్పులు లేవు.

  • 02 Nov 2023 01:21 PM (IST)

    భార‌త జైత్ర యాత్ర‌కు లంక అడ్డుక‌ట్ట వేస్తుందా..?

    స్వదేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఆరు మ్యాచుల్లోనూ గెలిచి ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా నిలిచింది. మెగాటోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా శ్రీలంక‌తో త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లాల‌ని టీమ్ఇండియా భావిస్తోంది. ఎలాగైనా గెలిచి సెమీస్ రేసులో నిల‌వాల‌ని శ్రీలంక ఆరాట‌ప‌డుతోంది.