NZ vs SL Match
ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరాయి. ఇప్పటికే సెమీస్ కు ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చేరుకున్నాయి. ఫోర్త్ ప్లేస్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ అదృష్టాన్ని ఇవాళ శ్రీలంక జట్టుతో జరిగే మ్యాచ్ లో పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తేనే సెమీస్ కు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. ఓడిపోతే సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టతరంగా మారుతాయి. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలో కివీస్ జట్టు ఉంది.
న్యూజిలాండ్ దే పైచేయి..
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య మొత్తం 101 వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ 51 విజయాలతో ముందంజలో ఉండగా.. శ్రీలంక 44 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఎనిమిది మ్యాచ్ లు ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరోవైపు వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్లు 11సార్లు తలపడ్డాయి. ఇందులో శ్రీలంక ఆరు విజయాలు సాధించగా.. న్యూజిలాండ్ ఐదు సార్లు గెలిచింది. ఈ టోర్నీలో తొలుత వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన కివీస్ జట్టు ఆ తరువాత నాలుగు మ్యాచ్ లలో వరుసగా ఓడిపోయింది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో సెమీస్ ఆశలు నిలవాలంటే కివీస్ జట్టు తప్పక గెలవాలి. దీంతో ఈ మ్యాచ్ లో కివీస్ ఏ మేరకు రాణిస్తుందోనన్న అంశం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
Also Read : ENG vs NED : ఇంగ్లాండ్‌కు ఊరట.. నెదర్లాండ్స్ పై ఘన విజయం..
కివీస్ ను భయపెడుతున్న వరుణుడు..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉంది. దీంతో న్యూజిలాండ్ జట్లుకు వరుణుడు భయం పట్టుకుంది. ఇదే మైదానంలో న్యూజిలాండ్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగ్గా.. న్యూజిలాండ్ 401 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో సెమీస్ పోరులో కివీస్ కొంత వెనుకపడిపోయింది. అయితే, ఈ రోజు అదే స్టేడియంలో జరిగే న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. గురువారం 80శాతం వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ నిలిచిపోతే కీవీస్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్ సెమీస్ ఆశలు మరింత క్లిష్టతరంగా మారుతాయి. బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా) : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్
శ్రీలంక తుది జట్టు (అంచనా): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెల్ మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, కసున్ రజిత, దిల్షన్ మధుశంక