Kishore Kumar Jena : జావెలిన్ స్టార్ కిషోర్ జెనాకు రూ.1.5 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన సీఎం

చైనాలోని హాంగ్‌జౌ న‌గ‌రంలో జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌లు 2023లో రజతం సాధించిన ఒడిశాకు చెందిన జావెలిన్ స్టార్ అథ్లెట్ కిషోర్ కుమార్ జెనాకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.

CM Naveen Patnaik - Kishore Kumar Jena

Javelin Star Kishore Kumar Jena : చైనాలోని హాంగ్‌జౌ న‌గ‌రంలో జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌లు 2023లో రజతం సాధించిన ఒడిశాకు చెందిన జావెలిన్ స్టార్ అథ్లెట్ కిషోర్ కుమార్ జెనాకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. ఒడిశా రాష్ట్రం గ‌ర్వ‌ప‌డేలా చేసినందుకు అత‌డికి ఈ న‌గ‌దు పుర‌స్కారాన్ని అందిస్తున్నారు. ఆసియా క్రీడ‌ల్లో జావెలిన్ ను 87.54 మీటర్ల దూరం విసిరి వ్యక్తిగత బెస్ట్ ఇచ్చిన కిషోర్ ర‌జ‌త ప‌త‌కం గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

తన అద్భుతమైన ఆటతీరుతో దేశానికి, రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టినందున జెనా సాధించిన ఘనత దేశ క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని సీఎం పట్నాయక్ అన్నారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నందుకు కిషోర్‌కు అన్ని విధాలా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.

Joe Root : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచులో రూట్ అందుకున్న అరుదైన ఘ‌న‌త‌లు ఇవే..

‘కిశోర్‌ అద్భుతమైన ప్రదర్శన, అతని పట్టుదల, సంకల్పానికి గుర్తింపుగా ఈ అవార్డు. ఆసియా క్రీడల్లో విజయం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు అతనికి అభినందనలు. కిషోర్ విజయం వ్యక్తిగత ఔన్నత్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వర్ధమాన అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది.’ అని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నందుకు కిషోర్‌కు అన్ని విధాలా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. కిషోర్ స్వగ్రామం అయిన పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి సమీపంలోని కోతాసాహిలో వేడుక‌లు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులకు మిఠాయిలు పంచిపెట్టారు. ‘కిశోర్‌ ఆసియా క్రీడల కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను తన ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నందున గత రెండేళ్లుగా అతనిని చూడలేదు.’ అని కిషోర్ తల్లి చెప్పారు.

MS Dhoni : ధోని బుగ్గ‌పై ముద్దు పెట్టిన బాలీవుడ్ న‌టుడు.. వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు