×
Ad

Yashasvi Jaiswal : వెస్టిండీస్ పై య‌శ‌స్వి జైస్వాల్ శ‌త‌కం.. బ్రాడ్‌మ‌న్‌, స‌చిన్, కుక్‌ ఉన్న ఎలైట్ జాబితాలో చోటు..

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు.

ONLY TENDULKAR HAS MORE TEST HUNDREDS THAN YASHASVI JAISWAL IN INDIAN TEST CRICKET AT THE AGE OF 23

Yashasvi Jaiswal : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొడుతున్నాడు. ఢిల్లీ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కంతో చెల‌రేగాడు. 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్ (Yashasvi Jaiswal )కు ఇది ఏడో సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో అత‌డు ఓ అరుదైన జాబితాలో చేరాడు.

24 ఏళ్ల లోపు టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ జాబితాలో అత‌డు చోటు సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు డాన్ బ్రాడ్‌మన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. బ్రాడ్‌మ‌న్ 24 ఏళ్ల లోపు 12 శ‌త‌కాలు బాదాడు. ఆ త‌రువాత స‌చిన్, గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్‌, జావెద్ మియాందాద్, గ్రేమ్ స్మిత్, అలిస్ట‌ర్ కుక్, కేఎన్ విలియ‌మ్స‌న్‌లు ఉన్నారు.

Jasprit Bumrah : జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏకైక పేస‌ర్‌..

24 ఏళ్ల లోపు టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* డాన్‌బ్రాడ్ మ‌న్ – 12 సెంచరీలు (26 ఇన్నింగ్స్‌ల్లో)
* స‌చిన్ టెండూల్క‌ర్ – 11 శ‌త‌కాలు (80 ఇన్నింగ్స్‌ల్లో)
* గ్యారీఫీల్డ్ సోబర్స్ – 9 సెంచరీలు (54 ఇన్నింగ్స్‌ల్లో)
* అలిస్ట‌ర్ కుక్‌, జావేద్ మియాందాద్‌, గ్రేమ్ స్మిత్, కేన్ విలియ‌మ్స‌న్‌, య‌శ‌స్వి జైస్వాల్ లు త‌లా 7 శ‌త‌కాలు బాదారు.

టెస్టుల్లో 24 ఏళ్ల లోపు అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

* స‌చిన్ టెండూల్క‌ర్ – 11 శ‌త‌కాలు
* య‌శ‌స్వి జైస్వాల్ – 7 సెంచ‌రీలు
* ర‌విశాస్త్రి – 5 శ‌త‌కాలు
* దిలీప్ వెంగ్ స‌ర్కార్ – 5 సెంచ‌రీలు

IND W : ద‌క్షిణాఫ్రికా చేతిలో ఓట‌మి.. భార‌త్‌ సెమీస్‌కు చేరాలంటే..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన భార‌త్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (38) తొలి వికెట్‌కు 58 ప‌రుగులు జోడించిన త‌రువాత వారికన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సాయి సుద‌ర్శ‌న్‌తో క‌లిపి జైస్వాల్ భార‌త స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తున్నాడు.

57 ఓవ‌ర్లు ముగిసే స‌రికి తొలి ఇన్నింగ్స్‌లో భార‌త స్కోరు 216/1 గా ఉంది. య‌శ‌స్వి జైస్వాల్ (111), సాయి సుద‌ర్శ‌న్ (67)లు క్రీజులో ఉన్నారు.