×
Ad

Quinton de Kock : క్వింట‌న్ డికాక్ అరుదైన ఘ‌న‌త.. విరాట్ కోహ్లీ, జోరూట్‌, డివిలియ‌ర్స్‌, కేన్ విలియ‌మ్స‌న్ రికార్డులు బ్రేక్‌..

ద‌క్షిణాఫ్రికా స్టార్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ (Quinton de Kock ) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

PAK vs SA 3rd ODI Quinton de Kock surpasses Kohli Kane Williamson and root to achieve major feat in ODIs

Quinton de Kock : ద‌క్షిణాఫ్రికా స్టార్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వ‌న్డే క్రికెట్‌లో 7వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ఫైస‌లాబాద్ వేదిక‌గా పాకిస్తాన్ తో మూడో టీ20 మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 44 ప‌రుగుల వ‌ద్ద డికాక్ ఈ ఘ‌నత సాధించాడు. స‌ల్మాన్ అఘా బౌలింగ్‌లో సింగిల్ తీసి వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 7వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు క్వింట‌న్ డికాక్ (Quinton de Kock).

IND vs AUS : టీమ్ఇండియాదే టీ20 సిరీస్‌.. వ‌ర్షం కార‌ణంగా ఐదో టీ20 మ్యాచ్ ర‌ద్దు..

ఈ క్ర‌మంలో అత‌డు స్టార్ ఆట‌గాళ్లు కేన్ విలియ‌మ్స‌న్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియ‌ర్స్‌, జోరూట్‌ల‌ను అధిగ‌మించాడు. ఇక ఈ జాబితాలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హషీమ్ ఆమ్లా అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 150 ఇన్నింగ్స్‌ల్లో హ‌షీమ్ ఆమ్లా వ‌న్డే క్రికెట్‌లో 7వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక డికాక్ విష‌యానికి వ‌స్తే.. అత‌డికి 158 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం అయ్యాయి.

వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల ప‌రంగా) 7వేల ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

* హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) – 150 ఇన్నింగ్స్‌లు
* క్వింట‌న్ డికాక్ (ద‌క్షిణాఫ్రికా) – 158 ఇన్నింగ్స్‌లు
* కేన్ విలిమ‌య్స‌న్ (న్యూజిలాండ్‌) – 159 ఇన్నింగ్స్‌లు
* విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 161 ఇన్నింగ్స్‌లు
* ఏబీ డివిలియ‌ర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 166 ఇన్నింగ్స్‌లు
* జోరూట్ (ఇంగ్లాండ్‌) – 168 ఇన్నింగ్స్‌లు

Abhishek Sharma : చ‌రిత్ర సృష్టించిన అభిషేక్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

ఇక ఈ మ్యాచ్‌లో డికాక్ మొత్తంగా 70 బంతులు ఎదుర్కొన్నాడు. 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 53 ప‌రుగులు సాధించాడు. అత‌డితో పాటు ల్హువాన్-డ్రే ప్రిటోరియస్ (39; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మిగిలిన వారు ఘోరంగా విఫ‌లం కావ‌డంతో మూడో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 37.5 ఓవ‌ర్ల‌లో 143 ప‌రుగుల‌కే ఆలౌటైంది. పాక్ బౌల‌ర్ల‌లో అబ్రార్ అహ్మద్ నాలుగు వికెట్లు తీశాడు. మ‌హమ్మద్ నవాజ్, సల్మాన్ ఆఘా, షాహీన్ అఫ్రిది లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.