Pakistan Captain Skips Post Match Presentation Coach Explains Reason
IND vs PAK : ఆసియాకఫ్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడిపోయింది (IND vs PAK). మ్యాచ్ అనంతరం భారత జట్టు పాక్‌తో కరచాలనం చేసేందుకు ఇష్టపడలేదు.
మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో కూడా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అగాతో సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తరువాత కూడా సూర్య మైదానంలో ఉన్న దూబేతో కలిసి ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు.
IND vs PAK : భారత్‌తో అట్టుంటది మరీ.. పాక్ కెప్టెన్ మైండ్ బ్లాక్.. దెబ్బకు ముఖం చాటేశాడు.
ఓ వైపు కరచాలనం కోసం పాక్ ఆటగాళ్లు మైదానంలో వేచి చూస్తుండగా భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాక సఫోర్టింగ్ సాఫ్ డ్రెస్సింగ్ రూమ్ డోర్‌ను మూసి వేశారు. ఈ పరిణామాలతో కలత చెందిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా మ్యాచ్ అనంతరం నిర్వహించే ప్రెజెంటేషన్ వేడుకకు రాలేదు.
No handshake by Indian team.
Pakistan waited for handshake but India went to the dressing room and closed the doors.
What a humiliation by Indian team 🤣
Belt treatment for Porkis#INDvPAK #IndianCricket #INDvsPAK #indvspak2025 #AsiaCupT20 #AsiaCup #ShubmanGill #ViratKohli𓃵 pic.twitter.com/zXMXZEmiuP
— Aman (@dharma_watch) September 14, 2025
కాగా.. మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాక్ కోచ్ మైక్ హెస్సన్ పాల్గొన్నాడు. ఈ సమావేశంలో విలేకరులు పాక్ కెప్టెన్ ప్రెజెంటేషన్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదు అని ప్రశ్నించారు. భారత జట్టు కరచాలనం పట్ల నిర్లక్ష్యం వహించడమే ఈ చర్యకు కారణం అని ఆయన ఖచ్చితంగా చెప్పలేదు. అయినప్పటికి ఆట తరువాత జరిగిన పరిణామాలతో పాక్ కెప్టెన్ నిరాశ చెందాడని ఆయన అంగీకరించాడు.
Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. పాక్ పై ఒకే ఒక్క భారతీయుడు..
“ఏం జరిగిందో అందరం చూశాము. మేము కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా ప్రత్యర్థి ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంతో మేము నిరాశ చెందాం. మేము కరచాలనం చేసేందుకు మైదానంలోకి వెళ్లాం. అయితే.. అప్పటికే వారు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఇక మ్యాచ్ ముగిసిన విధానం నిరుత్సాహపరిచింది. ఈ మ్యాచ్‌లో మా ఆటతీరు బాగా లేదు. సల్మాన్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడకపోవడం అనుకోకుండా జరిగిపోయింది.” అని మైక్ హెస్సన్ తెలిపాడు.