Pakistan Celebrated Arshad Nadeem Historic Javelin Throw Gold Medal In Olympics
పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ నిరీక్షణకు అథ్లెట్ అర్షద్ నదీమ్ తెరదించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. గత ఒలింపిక్స్ రికార్డులు అన్ని బద్దలు కొడుతూ ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. 1984 లాస్ ఏంజెల్స్ గేమ్స్‌లో పాకిస్తాన్ హాకీ టీమ్ చివరగా బంగారు పతకం గెలుచుకుంది.
అర్షద్ నదీమ్ స్వర్ణపతకాన్ని గెలుచుకోవడంతో పాకిస్తాన్ దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కరాచీ నగరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అర్షద్ నదీమ్ నినాదాలతో రోడ్లన్ని మారుమోగిపోయాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?
ఇక కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ అయితే పెద్ద మొత్తంతో నజరానా ప్రకటించాడు. సింధ్ ప్రావిన్స్ తరుపున పాకిస్తాన్ కరెన్సీలో రూ.5 కోట్లు నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు తెలిపాడు. నదీమ్ కు ఘన స్వాగతం పలుకుతామన్నారు.
గాయం నుంచి కోలుకుని..
నదీమ్ మోచేతి, మోకాలి గాయాలతో ఇబ్బంది పడ్డాడు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన తరువాత అందుబాటులో ఉన్న పరిమిత శిక్షణా సౌకర్యాలతో పారిస్‌కు వెళ్లాడు. అతడు ఒకానొక దశలో తన పాత జావెలిన్ అరిగిపోయిందని, కొత్త జావెలిన్‌ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.
scenes from arshad nadeem’s home town pic.twitter.com/5ZH8hSPsie
— IF7 (@IF7____) August 8, 2024